RK Roja: జజజ్జ.. రోజా.. జజజ్జ.. రోజా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రోజా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. తెరపై అందాలతారగా జనానికి శ్రీగంధాలు పూసిన రోజా, కొన్ని అరుదైన పాత్రల్లోనూ అభినయంతో అలరించారు. మాతృభాష తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళంలోనూ తనదైన బాణీ పలికించారు రోజా. రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు రోజా. ఇక బుల్లితెరపై ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు సైతం ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నాయని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖమంత్రిగా రోజా ప్రస్తుతం సాగుతున్నారు.
రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. 1972 నవంబర్ 17న తిరుపతిలో జన్మించారు. పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. హైదరాబాద్ మకాం మార్చిన తరువాత కూచిపూడిలో శిక్షణ పొందారు. తిరుపతికే చెందిన నటుడు డాక్టర్ శివప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ తపస్సు’ చిత్రంతో రోజా తెరంగేట్రం చేశారు. తమిళంలో ఆర్.కె.సెల్వమణి దర్శకత్వంలో రోజా నటించిన ‘చెంబరుతి’ మంచి విజయం సాధించి, ఆమెకు నాయికగా పేరు సంపాదించి పెట్టింది. తెలుగులో “సర్పయాగం, సీతారత్నంగారి అబ్బాయి, ముఠా మేస్త్రీ, పోలీస్ బ్రదర్స్, అన్న, శుభలగ్నం, ముగ్గురు మొనగాళ్ళు, ఘటోత్కచుడు, అన్నమయ్య, సంభవం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశా” వంటి చిత్రాలలో అలరించారు రోజా. ఇక బాలకృష్ణతో రోజా జోడీ కట్టిన “భైరవద్వీపం, బొబ్బిలిసింహం, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్” చిత్రాలలో నటిగా మురిపించారామె. ‘స్వర్ణక్క’ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డును దక్కించుకున్నారు రోజా. ఇప్పటికీ అడపా దడపా తెరపై కనిపిస్తూనే ఉన్నారామె. ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ‘జబర్దస్త్’ కార్యక్రమం విశేషంగా అలరిస్తోంది. ‘బతుకు జట్కా బండి’ వంటి కార్యక్రమాల్లోనూ రోజా తనదైన బాణీ పలికించారు.
Also Read
- Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్... అసలేం జరుగుతోంది ?
- Ram Charan : RC17 పై 'పెద్ది' ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
- Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
- Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు... 'దేశభక్తి' టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
‘చెంబరుతి’తో తనకు మంచి పేరు సంపాదించి పెట్టిన దర్శకుడు సెల్వమణిని రోజా వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి, ఆ పార్టీకి చెందిన ‘తెలుగు మహిళ’కు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ పార్టీ టిక్కెట్ పై 2009లో చంద్రగిరి నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి నెలకొల్పిన వైసీపీలో చేరారు. 2014, 2019లో వరుసగా రెండు సార్లు నగరి నుండి వై.సి.పి. టిక్కెట్ పై గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్టర్ కార్పోరేషన్ ఛైర్ పర్సన్ గా రెండేళ్ళు ఉన్నారు. పంచులు దంచడంలో మేటి అనిపించుకున్న రోజా, రాజకీయాల్లోనూ తనదైన బాణీ పలికించారు. ఏపీ స్టేట్ మినిస్టర్ గానూ రోజా తనదైన పంథాలో సాగుతున్నారు.
తాజావార్తలు
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!