NTV Telugu Site icon

Suriya 45 : సూర్య ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్న ఆర్జే బాలాజీ

Surya 45

Surya 45

కంగువా రిజల్ట్ సూర్యలో పెను మార్పులు తెచ్చాయి. వర్సటాలిటీ, మేకోవర్స్ కోసం టైం వేస్ట్ చేయకూడదన్న జ్ఞానోదయం కలిగింది. అందుకే చకా చకా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రెజెంట్ సూర్య 45 సెట్స్ పై ఉంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు టాక్. మూకుత్తి అమ్మన్‌తో డైరెక్టర్‌గా ఫ్రూవ్ చేసుకున్న యాక్టర్ ఆర్జే బాలాజీ థర్డ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. మూకుత్తి అమ్మన్ సీక్వెల్ వద్దనుకుని సూర్యను డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టాడు.

Also Read : Tuk Tuk : ఏఐ టెక్నాలజీతో సినిమా సాంగ్ షూట్.. ఏ సినిమాలో అంటే.?

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న సూర్య 45పై అంచనాలు డబుల్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు ఆర్జే బాలాజీ. ఇందులో సూర్యను డ్యూయల్ రోల్ లో చూపించబోతున్నాడట. అయ్యనార్ ప్లస్ లాయర్ పాత్రల కోసం స్టార్ హీరోను మేకోవర్ చేయించాడట బాలాజీ. త్రిష ఇందులో ఫీమేల్ లీడ్. ఈ సినిమాకు మూకుత్తి అమ్మన్‌లా ఫాంటసీ, డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నట్లు టాక్. దీపావళికి సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. సూర్య ఫ్యాన్స్ కోసం మాస్ ఫీస్ట్ రెడీ చేస్తున్నాడు ఆర్జే బాలాజీ. కానీ హీరో డ్యూయల్ రోల్ చేయడంపై కాస్తంత టెన్షన్ నెలకొంది. గతంలో కొన్ని సినిమాల విషయంలో డ్యూయల్ రోల్ వర్కౌట్ కాలేదు సూర్యకు. కొన్ని సోసో అనిపించాయి. 24 సూర్య S/o కృష్ణన్ ఓకే అనిపించినప్పటికీ సెవెన్త్ సెన్స్, రాక్షసుడు, బ్రదర్స్‌, కంగువాలో డ్యూయల్ రోల్ పోషించాడు సూర్య. కానీ ఇవేమీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయాయి. ఇప్పుడు మళ్లీ డ్యూయల్ రోల్ అంటే సూర్య రిస్క్ చేస్తున్నాడా అన్నడౌట్ వస్తోంది. వర్కౌట్ అయితే పర్వాలేదు కానీ.. ఏ మాత్రం తేడా కొట్టిందా  డ్యూయల్ రోల్ చేయడానికి సూర్య ఆలోచించాల్సిందే.