RJ Balaji: చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !

Rj Balaji, Ram Charan, Peddi Movie,

Rj Balaji, Ram Charan, Peddi Movie,

రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఆయనకు ఇతర భాషా సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కడం పరిపాటిగా మారింది. అయితే, తాజాగా ఒక దర్శకుడు బహిరంగంగా తాను చరణ్ అభిమానిని అని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. సూర్య, త్రిష జంటగా నటించిన ‘వీరభద్రుడు’ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకలో దర్శకుడు ఆర్ జే బాలాజీ మాట్లాడుతూ.. ‘నాకు పర్సనల్‌గా తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. నేను ఆయన వీరాభిమానిని. చరణ్ నటించిన ప్రతి సినిమాను నేను ఫాలో అవుతుంటాను. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు. చరణ్ పట్ల ఆయన చూపిన ఈ అభిమానం చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.