తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడు పేరుతో తీసుకువస్తున్నారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫైనాన్స్ క్లియరెన్స్ లేకపోవడంతో మార్నింగ్ షోస్, మాట్ని షోస్ క్యాన్సిల్ అయ్యాయి. దాంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్నారు. కరుప్పు రిలీజ్ డిలే అవడంతో నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. తన సినిమా విడుదల విషయంలో తలెత్తిన అనివార్య కారణాల వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడటంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
బాలాజీ మాట్లాడుతూ ” ఫ్యాన్స్, ప్రేక్షకులు నన్ను క్షమించండి ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. సినిమా విడుదలకు ముందు ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల షోలు రద్దయ్యాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాను. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సినిమా కచ్చితంగా విడుదలవుతుంది. మీరందరూ పడుతున్న ఇబ్బందికి నేను క్షమాపణలు చెబుతున్నాను” అని పేర్కొంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఆర్జే బాలాజీ చేసిన ఈ ప్రకటనతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు. సినిమా కోసం ఎంత సమయమైనా వేచి చూస్తామని ధైర్యంగా ఉండాలని ఆయనకు ధైర్యం చెబుతున్నారు. మరి సాయంత్రం 6 గంటలకు అడ్డంకులన్నీ తొలగి సినిమా థియేటర్లలోకి వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
#RjBalaji's Very Emotional video..🥲
"I'm really sorry.. It shouldn't have happened.. I didn't expect this too.. I hope all the issues will get resolved and the film will be released this evening at 6PM..❣️ Sorry for making you all go through this..🫂"pic.twitter.com/cCkOyFXfE0
— Laxmi Kanth (@iammoviebuff007) May 14, 2026
