Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్‌గా రితికా నాయక్.!

  • 'కొరియన్ కనకరాజు'తో మరో హిట్ ఖాతాలో
  • గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకున్న రితికా
  • లక్కీ చార్మ్‌గా భావిస్తున్న టాలీవుడ్ నిర్మాతలు
  • వరుస ఆఫర్లతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న బ్యూటీ
Ritika Nayak

Ritika Nayak

తెలుగు చిత్రసీమలో తనదైన అందం, ఆకట్టుకునే అభినయంతో కుర్రకారు మనసు దోచుకుంటోంది భామ రితికా నాయక్. తాజాగా థియేటర్లలో విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో ఆమె మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో రితికా నటనకు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఒకే వైపున మెస్మరైజ్ చేసే గ్లామర్, మరోవైపు పాత్రలో లీనమయ్యే పర్ఫార్మెన్స్‌తో ఈ బ్యూటీ థియేటర్లలో మ్యాజిక్ చేస్తోంది. మిరాయ్ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను లక్కీ చార్మ్‌గా భావిస్తున్నారు. ఈ చిన్నదాని ఐరన్ లెగ్ కాదని, తమ ప్రాజెక్ట్‌లకు ప్లస్ అయ్యే పక్కా గోల్డెన్ లెగ్ అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్రేజీ ఆఫర్లతో ప్రస్తుతం రితికా నాయక్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారుతోంది.