Site icon NTV Telugu

Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ వచ్చేసినట్టే..

Rithika

Rithika

Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికేసిందోచ్.. ఆమె ఎవరో కాదు మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్. అమ్మడికి లక్ మామూలుగా లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ హీరోగా చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ సినిమాలో కీలక పాత్రలో మెరిసింది. అది ఆమె ఖాతాలోకి పడలేదనుకోండి. ఇప్పుడు తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇందులో హీరోయిన్ పాత్ర కూడా కీలకంగానే ఉంది. ఆమె నటనకు స్కోప్ కూడా దక్కింది.

Read Also : Teja Sajja : తేజసజ్జా.. ఆ హీరోల లిస్టులో చేరిపోయినట్టే

మూవీ భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందానికి అందం, అభినయం, గ్లామర్, హిట్లు.. ఇలా అన్నీ కలిసొస్తున్నాయి ఈ బ్యూటీకి. చూస్తుంటే ఈ మూవీ తర్వాత అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న మీనాక్షి, శ్రీలీల, మృణాల్ ఠాకూర్ లాంటి వారిని వెనక్కి నెట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లందరికీ చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఎక్కువగా ప్లాపులే వారి ఖాతాలో ఉన్నాయి. అందుకే వారిని పక్కన పెట్టేసి ఫ్రెష్ హీరోయిన్ గా రితికనే తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ బ్యూటీ ఆచితూచి సినిమాలు ఎంచుకుంటోంది. ఈ మూవీతో ఆమె క్రేజ్ బాగా పెరిగిపోతోంది. ఇంకేముంది దీని తర్వాత ఆమె రేంజ్ ఎక్కడ ఉంటుందో చూడాలి.

Read Also : Tamannah : అతన్నే పెళ్లి చేసుకుంటా.. తమన్నా షాకింగ్ ఆన్సర్

Exit mobile version