Site icon NTV Telugu

Rishab Shetty : రిషబ్ శెట్టి..హోంబలే మధ్య విభేదాలు?

Rishab Shetty

Rishab Shetty

కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో ‘కాంతార’ ఒక సంచలనం, ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి హొంబాలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థను, ‘కాంతార’ అఫీషియల్ పేజీని అన్‌ఫాలో చేయడం ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతోంది. సాధారణంగా ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ నిర్మాణ సంస్థతో హీరోలకు అనుబంధం పెరుగుతుంది. కానీ, తన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన సినిమా పేజీని అన్‌ఫాలో చేయడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Also Read: Chiranjeevi : మెగాస్టార్ సంచలన నిర్ణయం.. త్వరలో అధికారిక ప్రకటన

రిషబ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక నిర్మాణ సంస్థతో ఏవైనా విభేదాలు తలెత్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై రిషబ్ శెట్టి కానీ, హొంబాలే ఫిల్మ్స్ కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ‘కాంతార 2’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అయి తరువాతి పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. కొందరు దీనిని ఒక సాధారణ విషయంగా కొట్టిపారేస్తున్నారు. సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాలను ‘క్లీన్’ చేస్తుంటారని, అనవసరమైన పేజీలను అన్‌ఫాలో చేయడం సాధారణమేనని వాదిస్తున్నారు. అయితే, తన సొంత సినిమా పేజీని అన్‌ఫాలో చేయడం మాత్రం అంత చిన్న విషయమేమీ కాదని మెజారిటీ నెటిజన్ల అభిప్రాయం. అయితే ఒకవేళ నిజంగానే రిషబ్ శెట్టికి, హొంబాలే ఫిల్మ్స్‌కు మధ్య ఏదైనా గ్యాప్ వస్తే అది ‘కాంతార’ తదుపరి భాగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Exit mobile version