Rishab Shetty : ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోతోంది. కాంతార1 సినిమాపై భారీ క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం సినీ ప్రపంచం ఎంతగానో వెయిట్ చేస్తోంది. అయితే ఇక్కడే రిషబ్ శెట్టి బ్యాక్ గ్రౌండ్ గురించి అంతా వెతుకుతున్నారు. వాస్తవానికి రిషబ్ కు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. రిషబ్ కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. ఆయన తండ్రి జ్యోతిష్యుడు. అన్న, అక్క తర్వాత రిషబ్ పుట్టారు. ఇంట్లో పరిస్థితి వల్ల ఖర్చులకు కూడా తండ్రిని అడిగేవాడు కాదు రిషబ్. డిగ్రీ తర్వాత ఫిల్మ్ మేకింగ్ పై షార్ట్ టర్మ్ కోర్సు చేశాడు. చదువుకునే రోజుల్లో నుంచే సినిమాల్లోకి రావాలనే తపన ఉంది ఆయనకు.
Read Also : ఓజీ మూవీ చూసిన చిరు, చరణ్, మెగా హీరోలు
సినిమా ఇండస్ట్రీలోకి 2008లో వచ్చాడు. కానీ ఎలాంటి ఛాన్సులు లేక మొదట ఆఫీస్ బాయ్ గా చేశాడు. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఏడేళ్లు పనిచేశాడు. దాని తర్వాతనే నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు. రక్షిత్ శెట్టి హీరోగా 2016లో వచ్చిన రికీ సినిమాతో డైరెక్టర్ గా మారాడు రిషబ్. అది యావరేజ్ హిట్ అందుకుంది. దాని తర్వాత రిషబ్ డైరెక్షన్ లో వచ్చిన కిరిక్ పార్టీ సంచలన విజయం సాధించింది. దెబ్బకు రిషబ్ పేరు మార్మోగిపోయింది. దాని తర్వాత హోంబలే సంస్థలో రూ.20 కోట్లతో చేసిన కాంతార 2022లో విడుదలై ప్రభంజనం సృష్టించింది. లోకల్ సినిమాగా వచ్చి.. చివరకు పాన్ ఇండియాను గడగడలాడించింది. రూ.400 కోట్ల దాకా వసూలు చేసింది. దెబ్బకు పాన్ ఇండియా వైడ్ గా రిషబ్ కు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ సినిమాకు రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ రూ.4 కోట్లు. కానీ ఇప్పుడు కాంతార1కు ఏకంగా రూ.100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. చిన్న ఆఫీస్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసి నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అదంతా అతని ట్యాలెంట్, కష్టం మాత్రమే.
Read Also : Pawan Kalyan : కన్నడలో ఓజీకి ఇబ్బందులపై స్పందించిన పవన్