RIPMeera: మీరా మేధావి కాదు.. దాంతో బాధపడేది.. సంచలన నిజాలు చెప్పిన టీచర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RIPMeera:కోలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. విజయ్ పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ నేటి ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇండస్ట్రీ మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి. 16 ఏళ్ల అమ్మాయి.. ఒత్తిడిని తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఇక మీరా మరణాన్ని పోలీసులు సూసైడ్ గా కాకుండా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అసలు 16 ఏళ్ళ అమ్మాయికి ఉండే ఒత్తిడిలు ఏంటి.. ? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం మీరా.. తన డైరీలో చదువు గురించి కానీ, వేరే దేని గురించి కూడా తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చింది లేదని రాసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్నేహితులు కూడా.. తాను డిప్రెషన్ లో ఉంటే మంచిగా మాట్లాడేవారని రాసుకొచ్చిందట. ఇక ఇవేమి కారణాలు కానప్పుడు మీరా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అని పోలీసులు విచారిస్తున్నారు.
Virushka: పండగ పూట కూడా వామికను చూపించరా.. అన్యాయం ఇది..?
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో 'రష్మిక మందన్న'
ఇక ఈ నేపథ్యంలోనే పోలీసులు మీరా స్నేహితులను, టీచర్స్ ను విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మీరా తల్లి ఫాతిమా ఒక వీడియోను షేర్ చేసింది. మీరా స్కూల్ ఈవెంట్ లో చురుగ్గా ఉన్న వీడియో అది. ఏదో విభాగంలో ఆమె లీడర్ గా బాధ్యతలు తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ వేడుకలో మీరా వైట్ ఫ్రాక్ లో ఎంతో అందంగా కనిపించింది. స్కూల్లో మీరా టీచర్స్ ఆమె గురించి ఒక కొత్త విషయాన్నీ చెప్పుకొచ్చారు. ” మీరు అంత మేధావి అని చెప్పలేము కానీ, తెలివైన పిల్ల. చదువుల్లో ఫస్ట్ కాకపోయినా.. యాక్టివ్ గా ఉంటుంది. అయితే .. మీరా తాను ఎక్కువ లావు ఉండేదాన్ని అని బాధపడేది. బొద్దుగా ఉన్నాను అని.. ఇతర పిల్లలతో తనను తాను పోల్చుకుంటూ ఆత్మన్యూనతభావంతో బాధపడేది” అని చెప్పుకొచ్చారు. అయితే ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత కారణం అయితే ఇది కాదని వారు తెలిపారు. ప్రస్తుతం మీరా మరణం అందరినీ కలిచివేస్తుంది. అస్సలు ఆమె మృతికి అసలు కారణాలు ఏంటి అనేది పోలీసులు విచారణలో తెలుసుకుంటారేమో చూడాలి.
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!