RGV: ఆర్జీవీ కంట్లో పడిన పిల్ల ఎవరో తెలిసిపోయిందోచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు అభిమానులు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే అర్జీవికి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. అయితే గొడవలు లేకపోతే అమ్మాయిలు, మందు తప్ప వర్మకు వేరే యావగేషన్ లేదు అంటే అతిశయోక్తి లేదు. ఒక నార్మల్ సాదాసీదా అమ్మాయిని స్టార్ సెలబ్రిటీగా చేయగల దమ్మున్న డైరెక్టర్ ఎవరు అంటే ఆర్జీవి అని చెప్పొచ్చు. సినిమాల వల్లనే అమ్మాయిలు సెలబ్రిటీలు అవుతారు అనుకోవడం అందరికీ తెలిసిందే.. కానీ ఆర్జీవి కంట్లో పడిన అమ్మాయి హీరోయిన్ కాకముందే సెలబ్రిటీగా మారుతుంది. ఇప్పటికే ఆర్జీవి కంట్లో పడిన ప్రతి ఒక్క అమ్మాయి సెలబ్రిటీగా కొనసాగుతుంది. ఇక తాజాగా మరో అమ్మాయి ఈ డైరెక్టర్ కంట్లో పడింది. నిన్న ఆర్జీవి ఒక అమ్మాయి వీడియో ను షేర్ చేస్తూ ఆమె ఎవరో చెప్పాల్సిందిగా అభిమానులను కోరాడు. అందులో అమ్మాయి చీర కట్టులో మెస్మరైజ్ చేస్తూ కనిపించింది. ఇక ఆమెమీద వర్మ మనసు పడ్డాడని చెప్పుకొచ్చాడు.
SKN: గణపతి లడ్డు.. లక్షల్లో పాడి సొంతం చేసుకున్న బేబీ నిర్మాత
Also Read
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు .. ఆర్జీవీ తలుచుకుంటే.. అమ్మాయి పేరు తెలుసుకోవడం ఎంతలోపు.. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడీని ఎట్టకేలకు తెలుసుకొని అభిమానులకు ఆమెను పరిచయం చేశాడు. ఆ ముద్దుగుమ్మ పేరు శ్రీలక్ష్మి అని తెలుస్తుంది. ఇక ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడీని పోస్ట్ చేస్తూ “హే శ్రీలక్ష్మి నీకు కనుక నటనలో ఇంట్రెస్ట్ ఉంటే నాకు డీఎమ్ చెయ్” అంటూ చెప్పుకొచ్చాడు.. అంతేకాకుండా “చాలామంది శారీ మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అని అంటారు దాని మీద నాకు నమ్మకం లేదు.. నీ వీడియో చూసేవరకు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను శారీ మీద ఒక ఫిల్మ్ తీయాలని ఆశగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆర్జీవీ కన్నుబడితే ఎలాంటి అమ్మాయి అయినా సెలబ్రిటీ అయిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఈ డైరెక్టర్ చూపు ఈ శ్రీలక్ష్మి అనే అమ్మాయి మీదే ఉంది. ఆమె మలయాళ బ్యూటీ అని తెలుస్తుంది. ఆమె సోషల్ మీడియా నిండా చీరకట్టుతో ఎంతో అద్భుతంగా ఉంది. దీంతో ఈమె పంట పండిందని అభిమానులు చెప్పకు వస్తున్నారు. మరి ఈ బ్యూటీతో ఆర్జీవీ ఎలాంటి చీర కథ తీస్తాడో చూడాలి.
Some say SAAREE is the most BEAUTIFUL dress but I never believed till I saw this video https://t.co/3jXCxXQOVh I am inspired to make a film called SAAREE with her https://t.co/JgtBuOXyO0 https://t.co/lu3fdKdgBO
— Ram Gopal Varma (@RGVzoomin) September 28, 2023
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!