CM Revanth Reddy : పెంచే సినిమా టికెట్ రేట్లలో కార్మికులకు 20 శాతం.. లేకుంటే జీఓ ఇవ్వం
- హాలీవుడ్‌ను ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత నాది
- చిన్న సినిమాలను తక్కువచేసి చూసే ప్రసక్తే లేదు
- ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుమీదు.. గద్దర్ ఫిల్మ్ అవార్డ్‌ను ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం
- సినీ కార్మికుల శ్రమ నాకు తెలుసు
- అధికారంతో నాకళ్లు మూసుకుపోలేదు
- కార్మికుల కష్టాలు నాకు తెలుసు
- ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ వెళ్లింది అంటే కారణం కార్మికులే. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : యూసుఫ్‌గూడలో నిర్వహించిన సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సినీ కార్మికుల శ్రమ నాకు బాగా తెలుసు. మీ కష్టాలు తెలుసుకోలేనంతగా నా కళ్లూ మూసుకోలేదు” అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు. “ఒకప్పుడు సినీ పరిశ్రమ అంటే మద్రాసే అనుకునే వారు. కానీ, నేడు తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుల వరకు వెళ్లగలిగింది. ఈ గౌరవం తెర వెనుక కష్టపడే కార్మికుల శ్రమ ఫలితమే” అని రేవంత్ అభినందించారు.
నిలిచిపోయిన నంది అవార్డులను ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో అవార్డులను ఇస్తున్నామని సీఎం తెలిపారు. “హాలీవుడ్ కూడా తెలంగాణకు వచ్చి షూటింగ్ చేసుకునేలా మారాలి. చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు. ఐటీ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, సినిమా పరిశ్రమకూ అంతే ప్రాధాన్యత ఇస్తాం” అని ఆయన అన్నారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
సినీ కార్మికుల సంక్షేమంపై సీఎం పలు కీలక హామీలు ఇచ్చారు. “కృష్ణా నగర్‌లో మూడు నుంచి నాలుగు ఎకరాల్లో కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాల నిర్మిస్తాం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్ కూడా అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఉచిత వైద్యం కూడా అందిస్తాం” అని చెప్పారు. తన మాటకు కట్టుబడి కృష్ణానగర్‌కు వచ్చానని గుర్తుచేసిన రేవంత్.. “కార్మికుల కోసం ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తాం. వెల్ఫేర్ ఫండ్‌కు 10 కోట్లు ఇస్తున్నాం. కష్టాల్లో ఉన్న కార్మికుల కోసం ఆ నిధులు వినియోగించండి” అని అన్నారు.
అంతేకాకుండా, “సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20 శాతం వాటా తప్పనిసరి. ఆ వాటా వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ అవ్వాలి. లేదంటే టికెట్ ధరల పెంపుకు జీఓ ఇవ్వం” అని స్పష్టం చేశారు. నిర్మాతలు, కార్మికులు కుటుంబ సభ్యుల్లా ఉండాలని సూచించారు. ఫైటర్స్, టెక్నీషియన్ల నైపుణ్యం పెంచేందుకు ఫ్యూచర్ సిటీలో భూమి కేటాయిస్తామని తెలిపారు. “మీకు అవసరం ఉన్నప్పుడు మీకు అందుబాటులో ఉంటా. ప్రభుత్వం ఎల్లప్పుడూ మీ వెన్నంటి ఉంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Bengal Gang Rape case: వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో ప్రియుడే సూత్రధారి..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?