Darshan Fan Arrested: దర్శన్ అభిమాని అరెస్ట్.. ఎందుకంటే?
- చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్
- నటుడు దర్శన్ అరెస్ట్ నేపథ్యంలో అభిమానులు పోలీస్ స్టేషన్ ఎదుట రెచ్చగొట్టే ప్రకటన
- చేతన్ అనే దర్శన్ అభిమాని అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renuka Swamy Case Police Arrests Darshan Thoogudeepa Fan Chethan: రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే పరప్పణ అగ్రహారం జైలుకు పంపించారు. ఈలోగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన కొందరు దర్శన్ అభిమానులపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘రాబర్ట్’ సినిమా నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ గౌడ్ గురించి కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు దర్శన్ అభిమాని చేతన్ అరెస్ట్ అయ్యాడు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నటుడు దర్శన్‌ను అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. దీంతో దర్శన్ అభిమానులు రోజూ అక్కడ గుమిగూడేవారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన చేతన్ ఉమాపతి శ్రీనివాస్ గౌడ్ ను కించపరిచేలా ప్రకటన చేశాడు. నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ గౌడ్ కొన్ని ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంతో కోపోద్రిక్తుడైన చేతన్ బహిరంగంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఉమాపతి శ్రీనివాస్ గౌడ్ బసవేశ్వర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read
- Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. 'పెద్ది' షూటింగ్లో చరణ్‌కు ఏమైందో చెప్పిన నిర్మాత!
- Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
- IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
- KamalHaasan : నాకు రజనీకాంత్‌కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ఆ నేపథ్యంలో ఇప్పుడు చేతన్ని అరెస్ట్ చేశారు. చేతన్ అరెస్ట్ తర్వాత అతడికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. “నా పేరు చేతన్. నేను దర్శన్ అభిమానిని. ఆ రోజు అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాను. అక్కడ ఉమాపతి శ్రీనివాస్ గౌడ్ గురించి తప్పుగా మాట్లాడాను. ఇప్పుడు చట్టానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను” అని చేతన్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. నిందితుడు చేతన్‌పై బసవేశ్వర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 504, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాగే, నటుడు దర్శన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దర్శన్‌ను ఆయన భార్య విజయలక్ష్మి సోమవారం (జూన్ 24) కలిశారు. అంతేకాకుండా కొడుకు వినీష్ను తీసుకెళ్లిన విజయలక్ష్మి.. దర్శన్‌తో 15 నిమిషాల పాటు మాట్లాడింది. 14 రోజుల తర్వాత దర్శన్ తన కుమారుడిని చూసి భావోద్వేగానికి గురై కన్నీరుమున్నీరుగా విలపించినట్లు సమాచారం. నటుడు దర్శన్, పవిత్రగౌడ్ సహా మొత్తం 17 మంది నిందితులు పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు.
తాజావార్తలు
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్‌కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
-
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
-
Chhattisgarh Congress: ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ఆఫీస్‌లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..