Renuka Swami Wife Comments on Her Husband Murder: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ఆరోపణలపై కన్నడ హీరో దర్శన్, అతని భార్య, స్నేహితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి దర్శన్ అభిమాని ఒకరు బెంగళూరుకు పిలిపించి కామాక్షిపాళ్యంలోని తన స్నేహితుడి గోడౌన్ షెడ్డులో దాచిపెట్టి దారుణంగా కొట్టి చంపినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఇప్పుడు హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడతో సహా 13 మందిని అరెస్టు చేశారు పోలీసులు. బెంగళూరులో రేణుక స్వామి హత్యపై రేణుకాస్వామి భార్య సహాన మీడియా ముందు కన్నీరుమున్నీరుగా విలపించారు. నా భర్త హత్యకు గురయ్యాడు, నేను గర్భవతిని. మాకు పెళ్లయి ఏడాది అయింది. నా భర్తకు ఇలా జరగకూడదు, నేను తల్లి అవుతున్నాను, భర్త లేకుండా ఎలా ఉండాలి? నా, బిడ్డ భవిష్యత్తు ఏమిటి? అని ప్రశ్నిస్తూనే తనకు న్యాయం చేయాలని కన్నీళ్లతో వేడుకుంది.
Sai Dharam Tej: షాకింగ్: అల్లు జంటను అన్ ఫాలో చేసిన మెగా మేనల్లుడు
రేణుకాస్వామి వెళ్లేటప్పుడు మాతో ఏమీ అనలేదు. ఆ రోజు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి మా అమ్మ దగ్గరికి డిన్నర్ కి వస్తానని చెప్పాడు కానీ ఎప్పుడూ రాలేదు. నా భర్త దర్శన్ అభిమాని కాదు. నా భర్త తప్పు చేసి ఉంటే వార్నింగ్ ఇచ్చి ఉండాల్సింది. అతని జీవితానికి ఎందుకు ఆటంకం కలిగించాలి? భర్తను కోల్పోయిన నా, నా బిడ్డ భవిష్యత్తు ఏంటని మీడియా ముందు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక ఆమె మాట్లాడుతూ రేణుకాస్వామి వెళ్లేటప్పుడు మాతో ఏమీ అనలేదు. ఆ రోజు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి మా అమ్మ దగ్గరికి డిన్నర్ కి వస్తానని చెప్పాడు కానీ రాలేదు. అలాగే నా భర్త దర్శన్ అభిమాని కాదు. నా భర్త తప్పు చేసి ఉంటే వార్నింగ్ ఇచ్చి ఉండాల్సింది, అతని జీవితానికి ఎందుకు ఆటంకం కలిగించాలి? అని అంటూ ఇక మాట్లాడలేనంటూ మీడియా ముందు బాధతో విలపించారు. మాకు న్యాయం చేయాలని మృతురాలు రేణుకాస్వామి భార్య సహాన మీడియాకు విజ్ఞప్తి చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌ను రక్షించేందుకు కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. బెంగళూరులోని ఓ ప్రముఖ మంత్రిని దర్శన్ తరపు వారు సంప్రదించినట్లు వినిపిస్తోంది. సీఎం, హోంమంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.