నటి రేణు దేశాయ్ మళ్లీ తెరపైకి రాబోతున్నారట.. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో ఆమె సామాజికవేత్త హేమలత పాత్రలో కనిపించి మంచి ప్రశంసలు తెచ్చుకున్నారు. కానీ ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోవడంతో రేణు ఆశించిన స్థాయిలో రీ-ఎంట్రీ జరగలేదు. అయినా కూడా ఆమె మాత్రం నిరుత్సాహపడలేదు. ఈసారి మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్‌లు వింటూ, తనకు సరిపోయే మంచి పాత్ర కోసం ఎదురు చూస్తోందట. తాజా సమాచారం ప్రకారం ప్రకారం రేణు దేశాయ్ ఒక కొత్త కమర్షియల్ సినిమాలో నటించబోతున్నారట.
అయితే ఈసారి ఆమె ఎంచుకున్న రోల్ సీరియస్ కాదు, కాస్త కామెడీ టచ్ ఉన్నదట. హీరోయిన్‌కి అత్తగా కనిపించే పాత్రలో రేణు స్క్రీన్ మీద నవ్వులు పూయించబోతున్నారని ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తోంది. కథలో ఆమె పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా, కీలకంగా ఉంటుందట. ఇక ఆమె ఓకే చెప్పిన సినిమా వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. హీరో, హీరోయిన్ ఎవరు? సినిమా డైరెక్టర్ ఎవరు? అనే వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే రేణు దేశాయ్ లాంటి సెన్సిబుల్ యాక్ట్రెస్ మళ్లీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ రోల్‌లో కనిపించబోతుండటం ఆమె అభిమానుల్లో మంచి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది.