Site icon NTV Telugu

Renu Desai: పవన్ సీఎం అవ్వాలని నేను కోరుకోను.. సపోర్ట్ కూడా ఇవ్వను

Renu

Renu

Renu Desai: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ తో ప్రేమలో పడి.. లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడే అకీరాకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను వివాహమాడింది. పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు పుట్టింది. ఇక ఎన్నో ఏళ్ళు వీరి దాంపత్యం సాగలేదు. విబేధాలు కారణంగా పవన్ నుంచి విడాకులు తీసుకొని.. రేణు పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తోంది. ఇక పవన్ తో విడాకులు తరువాత రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. ఆద్య చిన్నపిల్ల కావడంతో ఆ ఆలోచనను మానుకొని.. పిల్లలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక దాదాపు 23 ఏళ్ళ తరువాత రేణు.. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో మెప్పించింది. సినిమాలో కొద్దిసేపే కనిపించినా.. రేణుకు మంచి గుర్తింపే దక్కింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది.

Venkatesh: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. వెంకీమామ రెండో కూతురి నిశ్చితార్థం

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రేణు కు ఒక ప్రశ్న ఎదురయ్యింది. పవన్ సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారా.. ? అన్న ప్రశ్నకు రేణు మాట్లాడుతూ.. ” ఆయన గురించి ఈ ప్రశ్నే వద్దు. ఒక రాజకీయ నాయకుడిగా సమాజానికి పవన్ కళ్యాణ్ లాంటి వారు సమాజానికి అవసరం అని గతంలో నేను చెప్పాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అలా అని .. ఆయన సీఎం కావాలని, లేదని నేను కోరుకోవడం లేదు. పైన దేవుడు ఉన్నాడు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. కనీసం ఒక కామన్‌ వ్యక్తిగా కూడా ఆయనవైపు స్టాండ్‌ తీసుకోను. ఆయనకు ఓటు వేయండి అంటూ ఎన్నికల ప్రచారం కూడా చేయను. అది నాకు అనవసరం లేని విషయం. పవన్ గురించి ముందు కానీ, ఇప్పుడు కానీ నేను ఏదైతే చెప్పానో అవన్నీ నిజాలే. మరోసారి వాటిని చెప్పమన్నా చెప్తా .. కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకోండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version