NTV Telugu Site icon

Renu Desai: ఆయనతో పవన్ మాజీ భార్య.. ఫ్యాన్ మూమెంట్ అంటూ పోస్ట్

Renu

Renu

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆమె .. ఆ సినిమా షూటింగ్ లోనే పవన్ తో ప్రేమలో పడింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను పెళ్లాడింది. ఇక పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు పుట్టింది. కొన్నేళ్లు కలిసి ఉన్న ఈ జంట కొన్ని విభేదాల వలన విడాకులు తీసుకొని విడిపోయారు. అయినా పవన్ ఫ్యాన్స్ మాత్రం రేణును వదినమ్మ అనే పిలుస్తారు. ఇక చాలా గ్యాప్ తరువాత రేణు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్యనే పవన్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడితే .. వారికి గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది. ఇక తాజాగా రేణు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది. తనకు ఇష్టమైన దర్శకుడితో ఫోటో దిగినట్లు తెలిపింది.

Upasana Konidela: అపోలో కొత్త బ్రాంచ్.. ఆమెకు గిఫ్ట్ అంటున్న మెగా కోడలు

మూడు రోజుల క్రితం రేణు.. అమెరికాలో నిర్వహించిన బాహుబలి కన్సర్ట్ లో పాల్గొన్న విషయం తెల్సిందే. అప్పుడు రాజమౌళి గురించి, బాహుబలి సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. ఇక అదే కన్సర్ట్ లో ఆమె.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కలిసినట్లు చెప్పుకొచ్చింది. ఆయనతో దిగిన ఫొటోస్ ను షేర్ చేస్తూ.. “నార్వే ఆర్కెస్ట్రా ద్వారా బాహుబలి సంగీత కచేరీకి హాజరయ్యేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు మరియు ఉత్సాహంగా ఉన్నారు” అని చెప్పుకొచ్చింది. అయితే ఇది మూడు రోజుల క్రితం జరిగిందని కూడా తెలిపింది. ఇక రాఘవేంద్రరావుగారితో ఫోటో దిగడం హ్యాపీగా ఉందని, ఫుల్ ఫ్యాన్ మూమెంట్ అని తెలిపింది. అంతేకాకుండా ఆ ఫోటోలను అకీరా తీసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం రేణు దేశాయ్.. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.

Show comments