Renu Desai: టైగర్ ట్రైలర్ చూసి నా కూతురు అలాంటి మాట అంటుందని ఊహించలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renu Desai Daughter Aadya Comments on Tiger Nageswar Rao Trailer: టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో నటించి చాలా కాలం తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్న క్రమంలో సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో కొన్ని పర్సనల్ విషయాలు కూడా ఆమె షేర్ చేసుకున్నారు. అయితే హేమలతా లవణం గారి పాత్ర మీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది ? అని అడిగితే చాలా మార్పు తెచ్చిందని, సామాజికంగా ఇప్పటివరకు చేసింది సరిపోదనిపించిందని ఆమె అన్నారు. ఇంకా పని చేయాలనిపించింది, చిన్న పిల్లలు ఎవరూ ఆకలితో వుండకూదనేది నా లక్ష్యం, ఎంతవరకు కుదిరితే అంత ఆ దిశగా పని చేయాలని ఆమె అన్నారు. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా విషయంలో ఇప్పటివరకూ మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అని అడిగితే ట్రైలర్ చూసిన మా అమ్మాయి వయసుకు తగ్గ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా ఉందమ్మా’ అని చెప్పింది, ఇది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని అన్నారు.
Also Read
- Dragon Glimpse Review: ప్రశాంత్ నీల్ ఊరమాస్ ఎలివేషన్స్ ఓకే.. కానీ ఎన్టీఆర్ లుక్కే అలా ఉందేంటి? 'డ్రాగన్' గ్లింప్స్ రివ్యూ!
- Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్‌కు జాక్‌పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
- Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
- God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
నిజానికి ఆమె నా పాత్ర చూసి ఆ తెల్లబట్టలు ఏంటి ఆ వాలకం ఏంటి అని అడుగుతుంది అనుకున్నా, కానీ ఆమె అలా గర్వంగా ఉందని అనడంతో ఫర్లేదు మరిన్ని సినిమాలు చేయచ్చనే ధైర్యం వచ్చిందని అన్నారు. ఇక నటనకి చాలా విరామం ఇచ్చారు కదా ? ఇక ఇప్పుడు నటన కంటిన్యు చేస్తారా అని అడిగితే నాకు నటించేలానే వుంది కానీ కథ, పాత్ర, దర్శకుడు, నిర్మాత ఇవన్నీ కలిసి రావాలని అన్నారు. ఇప్పుడు టైగర్ నాగేశ్వర రావుకి ఈ మూడు కలిసొచ్చాయని, మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు. నాకు నటన ఎప్పుడూ కొనసాగించాలనే ఉంటుంది, నా వయసుకు తగ్గ మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా అని అన్నారు.
తాజావార్తలు
-
Medak: ఉమ్మడి మెదక్‌లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్‌తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
-
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?