Krishna Kumari Birth Anniversary : అనగనగా ఓ కృష్ణ కుమారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(మార్చి 6న నటి కృష్ణకుమారి జయంతి)
తెలుగు చిత్రసీమలో పలువురు అక్కాచెల్లెళ్ళు నటీమణులుగా అలరించారు. అయితే వారిలో అక్కను మించిన చెల్లెలుగా పేరొందిన నటి ఎవరంటే ముందుగా కృష్ణకుమారి పేరే వినిపిస్తుంది. తన అక్క షావుకారు జానకి చిత్రసీమలో అడుగు పెట్టిన వెంటనే తానూ కెమెరా ముందుకు వచ్చారు కృష్ణకుమారి. నాటి మేటి హీరోల సరసన నాయికగా నటించి, అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారామె. టాప్ స్టార్స్ తోనే కాదు అప్ కమింగ్ హీరోల సరసన కూడా హీరోయిన్ గా నటించి మెప్పించారామె. అందువల్లే కృష్ణకుమారి చిత్రసీమలో సాగిన తీరు భిన్నంగా అనిపిస్తుంది.
కృష్ణకుమారి 1933 మార్చి 6న జన్మించారు. తెలుగు వారే అయినా ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా కలకత్తాలో పనిచేయడం వల్ల అక్కడి నైహతిలో ఆమె జన్మించారు. ఆమె అక్క జానకి ‘షావుకారు’లో నటిస్తున్న సమయానికే ఓ బిడ్డ తల్లి. షూటింగ్ లో అక్కకు తోడుగా ఉంటూ, ఆమె బిడ్డను ఆడిస్తూ ఉండేవారు కృష్ణకుమారి. ఆ సమయంలోనే కృష్ణకుమారి అందం పలువురు నిర్మాతలు, దర్శకులను ఆకట్టుకుంది. ‘నవ్వితే నవరత్నాలు’లో తొలిసారి కృష్ణకుమారి నటించారు. ఆ తరువాత కొన్ని కన్నడ, తమిళ చిత్రాలలోనూ కృష్ణకుమారి అభినయించారు. యన్టీఆర్ తమ ఎన్.ఏ.టి. బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’ లో కృష్ణకుమారికి నాయికగా అవకాశమిచ్చారు. ఇదే ఆమె తొలిసారి పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటించిన తెలుగు సినిమా. తరువాత వరుసగా యన్టీఆర్ హీరోగా నటించిన “వినాయక చవితి, వీరకంకణం, దీపావళి” చిత్రాల్లో ఆయన సరసన నటించారు కృష్ణకుమారి. ‘పెళ్ళికానుక’లో ఏయన్నార్ సరసన జోడీగా కనిపించారు. ఆ తరువాత అక్కినేనితో కలసి “భార్యాభర్తలు, కులగోత్రాలు, వాగ్దానం, జమీందార్” వంటి సినిమాల్లో అభినయించారు. ఈ సినిమాలన్నీ కృష్ణకుమారికి నటిగా మంచి పేరు సంపాదించిపెట్టాయి.
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరి సరసన కృష్ణకుమారి వరుసగా నటించడానికి ఆ రోజుల్లో ఆ ఇద్దరు హీరోలు జమునను ఏదో కారణంగా తమ చిత్రాలలో నటింప చేయలేదు. ఆ సినిమాలన్నిటా కృష్ణకుమారిని నాయికగా ఎంచుకున్నారు. సదరు చిత్రాలే కృష్ఖకుమారికి మంచి పేరు సంపాదించిపెట్టడం విశేషం. అక్కినేని సరసన కృష్ణకుమారి నాయికగా నటించిన “పునర్జన్మ, అంతస్తులు” ఆమెకు నటిగా మంచిపేరు ఆర్జించాయి. ఇక యన్టీఆర్ జోడీగా కృష్ణకుమారి నటించిన “లక్షాధికారి, గుడిగంటలు, బందిపోటు, అగ్గి-పిడుగు, ఇరుగు-పొరుగు, ఉమ్మడికుటుంబం, వరకట్నం” వంటి చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. యన్టీఆర్ హిట్ పెయిర్ గా అలరించారామె. అప్పటి నూతన నటుడు కృష్ణంరాజు సరసన ‘చిలకా గోరింకా’లోనూ నాయికగా నటించారు. 1970ల ఆరంభానికే కృష్ణకుమారి అక్క, వదిన, అమ్మ పాత్రలు పోషించసాగారు. ఆ తరువాత కన్నడ, తమిళ చిత్రాలలోనే ఆమె ఎక్కువగా కనిపించారు. 2003లో దాసరి నారాయణరావు రూపొందించిన ‘ఫూల్స్’ లో చాలా ఏళ్ళ తరువాత కృష్ణకుమారి నటించారు. అదే ఆమె చివరి చిత్రం.
కృష్ణకుమారి పేరు తలచుకోగానే ముందుగా ఆమె నటించిన జానపద చిత్రాలు గుర్తుకు వస్తాయి. తరువాతే సాంఘిక చిత్రాలలోని విభిన్నమైన పాత్రలు మన కళ్ళముందు మెదలాడుతాయి. ఈ నాటికీ ఆ నాటి అభిమానుల మదిలో రాకుమారిగానే నిలచిపోయారు కృష్ణకుమారి.
ఖైతాన్ అదినేత అజయ్ మోహన్ ఖైతాన్ ను వివాహమాడిన కృష్ణకుమారి, దీపిక మయ్యా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. చాలా ఏళ్ళ క్రితమే బెంగలూరులో నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడే కృష్ణకుమారి తుదిశ్వాస విడిచారు. యన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు సరసన కృష్ణకుమారి నటించిన చిత్రాలు నాటి ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ సుస్థిరస్థానం సంపాదించాయి.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!