Gopichand: ఆ రోజు రావడం పక్కా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ప్రతిరోజు పండగే’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీ వాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆ మధ్య విడుదలైన ‘పక్కా కమర్షియల్’ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చిందని బన్నీ వాసు తెలిపారు. కరోనా కరుణిస్తే మార్చి 18 లేదా మే 20న వస్తామని గతంలో చెప్పారు. మార్చి 18 వెళ్ళిపోవడంతో మే 20న వస్తారని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఆ తేదీన కూడా కాకుండా జూలై 1న రాబోతున్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారని, కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారని వాసు చెప్పారు. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి ‘భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే’ వంటి సూపర్ హిట్స్ అందించారు. ‘ప్రతి రోజు పండగే’ సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
తాజావార్తలు
-
Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!