NTV Telugu Site icon

Kalki collections : బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర…రూ.1000కోట్ల క్లబ్‌లో ప్రభాస్..?

Untitled Design (6)

Untitled Design (6)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. గత నెల 27న విడుదలైన ఈ పాన్ ఇండియన్ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఈ మ్యాజిక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న కల్కి రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. వివరాలలోకి వెళితే నార్త్ అమెరికాలో కల్కి ప్రభంజనం ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. 15రోజులకు గాను $17 మిలియన్ల కలెక్షన్లు రాబట్టి జవాన్, RRR చిత్రాల కలెక్షన్స్ దాటి హైయ్యెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ నాన్ బాహుబలి-2గా నిలిచింది. మరోవైపు  రెండు తెలుగు రాష్ట్రాలలోను కల్కి బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది.

కాగా కల్కి ప్రపంచవ్యాప్తంగా పదిహేను రోజులకు గాను రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి మరో రికార్డును తన పేరిట నమోదు చేసింది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లు కలెక్షన్లు రాబట్టిన 6 చిత్రాలు వరుసగా అమిర్ ఖాన్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా దంగల్ ₹2024 కోట్లు, ప్రభాస్ – రాజమౌళిల బాహుబలి-2 ₹1810.60 కోట్లు, Jr.Ntr,చరణ్- రాజమౌళిల RRR ₹1387.26 కోట్లు, యష్ – ప్రశాంత్ నీల్ కే.జి.యఫ్ ₹1250 కోట్లు, షారుక్ ఖాన్ పఠాన్ ₹1050కోట్లు, షారుక్ జవాన్ ₹1148.32 కోట్ల కలెక్షన్లు సాధించాయి. తాజాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన “కల్కి 2898 ఏడీ” బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ 15 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ₹1000 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది. దీంతో వెయ్యి కోట్లు సాధించిన 7వ సినిమాగా,  ప్రభాస్ కెరీర్ లో  రెండవ సినిమాగా కల్కి నిలిచింది.

 

Also Read: Sai Pallavi: అందమైన కుందనాల బొమ్మ.. 6 అవార్డులు గెలిచెనమ్మా..