హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిన్న రాత్రి “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, రానా, త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్ర, తమన్ లతో పాటు ముఖ్య అతిథిగా కేటీఆర్ కూడా విచ్చేశారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “త్రివిక్రమ్ లేని భీమ్లా నాయక్ లేడు” అంటూ చెప్పడం విశేషం. అయితే తన పవర్ ఫుల్ స్పీచ్ తో అందరినీ మంత్రముగ్దులను చేసే త్రివిక్రమ్ “భీమ్లా నాయక్” ఈవెంట్‌లో ఎలాంటి స్పీచ్ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Read Also : Poonam Kaur : ఆర్జీవీని టార్గెట్ చేసిన బ్యూటీ… మరో డైరెక్టర్ నీ వదల్లేదుగా !!
“భీమ్లా నాయక్” సినిమా మొదలైనప్పటి నుండి త్రివిక్రమ్ సినిమాలో ఇన్వాల్వ్ అయినందుకు ఒక వర్గం ప్రేక్షకులు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి స్క్రిప్ట్ రైటర్ అతనే అయినప్పటికీ, దర్శకుడి స్థానాన్ని కూడా లాగేసుకున్నాడని అన్నారు. అందుకే త్రివిక్రమ్ వేదికపై మాట్లాడకుండా, ఈవెంట్‌లో దర్శకుడిని హైలెట్ చేయడానికే ఇలా సైలెంట్ గా ఉన్నాడని అంటున్నారు. మరోవైపు నిర్మాత బండ్ల గణేష్ ఆడియో కాల్ లీక్ కావడం త్రివిక్రమ్‌ని కలవర పెట్టిందని, అందుకే ఆయన ఈ కార్యక్రమంలో ప్రసంగం చేయలేదని మరో పుకారు కూడా ఉంది. ఏదేమైనా ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ సైలెంట్ గా ఉండడంతో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారని చెప్పొచ్చు.