RC17 Update: బిగ్ సర్‌ప్రైజ్.. ఈసారి అంతకుమించి, రెండు భాగాలుగా..!

  • రామ్‌ చరణ్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్
  • సుకుమార్‌తో మళ్లీ జతకట్టేందుకు సిద్ధమవుతున్న చరణ్
  • పుష్ప స్థాయిలో బడ్జెట్‌, స్కేల్‌ సినిమా
Rc17 Update

Rc17 Update

Ram Charan, Sukumar’s RC17 Big Update: ‘మెగా పవర్ స్టార్’ రామ్‌ చరణ్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్. చాలా కాలం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో చరణ్ మళ్లీ జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. ‘RC17’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ భారీ యాక్షన్ డ్రామాగా ఉండనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప’ స్థాయిలో బడ్జెట్‌, స్కేల్‌తో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కథ అండ్ ట్రీట్‌మెంట్ పూర్తిగా కొత్తగా, ఇప్పటివరకు చూడని విధంగా ఉండబోతోందట. సుకుమార్ మార్క్ డీటైలింగ్‌, ఇంటెన్స్ యాక్షన్‌, ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో మరో స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ‘రంగస్థలం’ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్‌ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాతే RC17 షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జూన్ నెల నుంచి షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కు లాంగ్ షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోందని టాక్.

Also Read: Vitamins Rich Foods: విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఇవే.. ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం!

ఇక ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తారన్న దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏఆర్ రెహమాన్ లేదా దేవి శ్రీ ప్రసాద్ (DSP)లో ఎవరో ఒకరు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి RC17 సినిమాతో చరణ్-సుకుమార్ కాంబినేషన్ మరోసారి టాలీవుడ్‌ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ‘పుష్ప’ తర్వాత సుకుమార్ తీసే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలు పెరుగుతున్నాయి. అధికారిక అనౌన్స్‌మెంట్ వస్తే.. ఈ హైప్ ఇంకో స్థాయికి చేరడం ఖాయం.