RC 15: పాన్ ఇండియా సినిమాకి 12 రోజులేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ కి పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోని, శంకర్ మార్క్ సోషల్ ఎలిమెంట్స్ కలిపి రూపొందుతున్న ఈ సినిమాని ఒక నెలలో 12 రోజులు మాత్రమే షూట్ చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన దిల్ రాజు, “శంకర్ భారతీయుడు 2 సినిమాని, రామ్ చరణ్ సినిమాని బాలన్స్ చేస్తూ షూట్ చేస్తున్నాడు. అందుకే ఒక నెలలో 12 రోజులు RC 15 షూటింగ్ జరుగుతోంది, ఇంకో 12 రోజులు భారతీయుడు 2 షూటింగ్ చేసుకుంటున్నారు” అని చెప్పాడు.
RC 15, భారతీయుడు… ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేవే. అలాంటి సినిమాలకి టైం కావాలి, ఎంత ఎక్కువ టైం కేటాయిస్తే అంత మంచి ఔట్పుట్ వస్తుంది. మాములుగా అయితే ఒక పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించే దర్శకుడు ఆ సినిమా అయ్యే వరకూ ఇంకో సినిమా గురించి ఆలోచించడు. దర్శకుడు శంకర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలని తెరకెక్కిస్తు పెద్ద సాహసమే చేస్తున్నాడు. శంకర్ చేస్తున్న ఈ రెండు పడవల ప్రయాణం ఎంత వరకు సక్సస్ అవుతుందో తెలియదు కానీ ‘RC 15’ కొత్త షెడ్యూల్ మాత్రం న్యూజిలాండ్ లో జరుగుతోంది. చరణ్ కియారాలపై ఒక సాంగ్ ని ఇక్కడ షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక చిత్ర యూనిట్ తిరిగొచ్చి, డిసెంబర్ నెలలో ‘RC 15’ కొత్త షెడ్యూల్ ని వైజాగ్ లో స్టార్ట్ చేయనున్నారు.
Also Read
- Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
తాజావార్తలు
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
AP News: నేడు రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు.. ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
-
India vs New Zealand: ఈడెన్ పార్క్‌లో టీమిండియా అజేయ రికార్డు.. 100% విజయాలతో భారత్ హవా!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
SIR New Schedule: తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..