శంకర్, చరణ్ పాన్ ఇండియా మూవీ లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా సినిమా ఈ రోజు ఉదయం పూజతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, రణ్వీర్ సింగ్, రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సునీల్, దిల్ రాజు, తమన్ తదితరులు హాజరయ్యారు. రామ్ చరణ్ పై తీసిన మొదటి షాట్ కు చిరంజీవి క్లాప్ కొట్టారు. దర్శక దిగ్గజం రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. “ఆర్సి 15” ప్రాజెక్ట్ లాంచ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో పాటు “ఆర్సీ 15 లాంచ్ డే” అనే హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది.
Read Also : డ్రగ్స్ కేసులో నేడు విచారణకు హీరో రానా
Also Read
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ఈ రోజు ఉదయం సినిమా ముహూర్త వేడుక సందర్భంగా మేకర్స్ ప్రత్యేక ప్రకటన పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో సినిమాలోని ప్రధాన తారాగణం, సిబ్బందిని పరిచయం చేశారు. అందరూ నల్ల సూట్లు, గాగుల్స్ ధరించి ఉండడం ఆకట్టుకుంటుంది. సినిమా థీమ్, బ్యాక్‌డ్రాప్ శంకర్, రామ్ చరణ్ అభిమానులందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇక మాలీవుడ్ స్టార్ జయరామ్, స్టార్ కమెడియన్ టర్న్ హీరో సునీల్, తెలుగు నటి అంజలి, హీరో నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏస్ సినిమాటోగ్రాఫర్ తిరు, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్, టాలెంటెడ్ ప్రొడక్షన్ డిజైనర్లు రామకృష్ణ, మోనికా, ప్రముఖ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా సినిమాకు సాంకేతిక బృందం కాగా, కీసర అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!