Rayavalasa : “రాయవలస” ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RAYSUN ప్రొడక్షన్స్ తమ తొలి చిత్రమైన “రాయవలస” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఊరి జీవితం, నిజ సంఘటనల ఆధారంగా మనసును తాకే కథతో వస్తున్న ఈ చిత్రం తెలుగు సినీ రంగంలో ఓ తొలి ప్రయత్నంగా నిలుస్తోంది. గోపీ కృష్ణ జె నిర్మించిన ఈ సినిమా, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆయన విజన్‌కు నిదర్శనం. డెబ్యూ ప్రొడ్యూసర్ అయినప్పటికీ, గోపీ కృష్ణ తన నిబద్ధత, ప్రణాళికా సామర్థ్యం, మరియు కట్టుబాటుతో మొత్తం ప్రొడక్షన్‌ను సజావుగా నడిపారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మహిళా దర్శకురాలు రాధిక , చిన్న గ్రామీణ కథలు, ఊరి జీవితం, మనుషుల మధ్య భావోద్వేగాలను ప్రతిబింబించే కథను తెచ్చే లక్ష్యంతో భారతదేశానికి వచ్చి సినిమా తీర్చిదిద్దారు. ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తి కావడం, ఆమె టీమ్ కృషి, నిబద్ధతకు ఉదాహరణ. అవార్డు విజేత దర్శకురాలిగా రాధిక, గ్లోబల్ టచ్‌తో నేటివిటీని మిళితం చేసి కథను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. DOP కిట్టు అద్భుత విజువల్‌లు అందించగా, రాఖీ నిజజీవిత సంఘటనల ఆధారంగా, గ్రామీణ నేపథ్యంతో శక్తివంతమైన కథను రూపొందించారు
కార్తిక్ ని హీరోగా పరిచయం చేసి “నవ యువ కథానాయకుడు”గా ఆవిష్కరించడం ప్రేక్షకులలో మంచి స్పందన తెచ్చింది. అమెరికాలో పెరిగిన కార్తిక్, సింగర్‌గా ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాడు; సింగర్ మాత్రమే కాక, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్‌లలో నటించి, రైటర్, లిరిసిస్ట్, డ్యాన్సర్‌గా ప్రతిభ చాటిన యువ ప్రతిభావంతుడిని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు పూర్తి ప్రతిభతో తీసుకురావడం ఒక ప్రత్యేక ప్రయత్నం.
Also Read
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
- Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
“Love Tied by Fate” – కథలోని భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబించే ట్యాగ్‌లైన్. టైటిల్ డిజైన్ ప్రత్యేకతతో ఆకట్టుకుంటుంది. హీరో మరియు టైటిల్‌ను విద్యార్థుల మధ్య ఒక కాలేజీలో గ్రాండ్‌గా లాంచ్ చేయడం, డెబ్యూ హీరో కార్తిక్ జయంతి పవర్ఫుల్, ఇంటెన్స్ లుక్‌తో ప్రజలు మరియు సినీ ప్రముఖుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. నిజ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, ఒక రైస్ మిల్ యజమాని రాజు జీవితం చుట్టూ తిరుగుతుంది. కుటుంబం, స్నేహితులు, గ్రామ పిల్లలతో సాగుతున్న అతని జీవితంలో హీరోయిన్ ప్రవేశం అనూహ్య మలుపులు తీసుకువస్తుంది. భావోద్వేగం, యాక్షన్, సంగీతం కలగలిపిన కంప్లీట్ ఎంటర్టైనర్గా “రాయవలస” ప్రేక్షకులను అలరించనుంది. హీరోయిన్ శ్రీషా నూలు ఇతర ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి, ఈ సినిమాలో కార్తిక్ జయంతితో జోడీగా కనిపిస్తూ అలరించబోతున్నారు. అలాగే, అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులు, త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు వంటి ప్రతిభావంతులు కూడా చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తారు.
తాజావార్తలు
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!