యాక్షన్ మోడ్ లో ‘రామారావు ఆన్ డ్యూటీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న వరుస చిత్రాలలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్. ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ బర్త్ డే పోస్టర్ లో రవితేజ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో ట్రైన్ సన్నివేశం కీలకమని తెలుస్తోంది. అలాగే మూవీలో రొమాంటిక్ ట్రాక్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అంశాలు ఉన్నట్టు పోస్టర్ లోనే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో ఆయన దూకుడు స్వభావం కలిగిన నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా కన్పించబోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే స్పష్టం చేశారు మేకర్స్.
Read Also : బిగ్ అప్డేట్ : లవర్స్ డే రోజున “సర్కారు వారి పాట” ట్రీట్
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
కాగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ యాక్షన్ మూవీలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. “రామారావు ఆన్ డ్యూటీ” 2022 మార్చి 25న వెండి తెరపైకి రానుంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!