Site icon NTV Telugu

ఫుల్లు కిక్కు ఎక్కిస్తానంటున్న ‘ఖిలాడీ’..

raviteja

raviteja

మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ అవర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన హాట్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి నాలుగవ సాంగ్ కి ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. రవితేజ బర్త్ డే సందర్భంగా జనవరి 26 న ఈ సినిమాలోని స్పెషల్ ఫోక్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

‘ఫుల్లు కిక్కు’ అంటూ సాగే ఈ సాంగ్ ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. పోస్టర్ ని బట్టి ఇది మాస్ సాంగ్ అని అర్ధమవుతుంది. ఇందులో రవితేజ తో ఇద్దరు హీరోయిన్లు చిందులు వేస్తారా..? లేక స్పెషల్ హీరోయిన్ ని దింపుతారా అనేది తెలియాల్సి ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ ని ఆయన తమ్ముడు సాగర్ తో పాటు రవితేజ కూడా గొంతు కలిపినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా కనిపిస్తుండగా హాట్ యాంకర్ అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. మరి ఈ ఫుల్లు కిక్కు సాంగ్ ప్రేక్షకులకు ఫుల్లు కిక్కు ఇస్తుందేమో చూడాలి.

Exit mobile version