Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!

Bangarupallaki

Bangarupallaki

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ ‘ఇరుముడి’. ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు డాటర్ సెంటిమెంట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక సంచలన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. రవితేజ ‘ఇరుముడి’ సినిమా కోసం ఒక అద్భుతమైన పాటను సిద్ధం చేసినట్లు వెల్లడిస్తూ… ‘బంగారు పల్లకి’ అనే లిరిక్‌తో సాగే పాటను రికార్డ్ చేసినట్లు జి.వి. ప్రకాష్ పేర్కొన్నారు. అంతేకాకుండా #mallepoolapallaki అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేయడంతో, ఈ ఆధ్యాత్మిక అండ్ మెలోడీ కాంబో సాంగ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి తెలుగులో ఈ సాంగ్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇప్పుడు ఆ సాంగ్ ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయనుండడం గమనార్హం.

ఆయన షేర్ చేసిన ప్రత్యేకమైన ఫొటోలో మ్యూజిక్ టీమ్‌తో పాటు చిత్రబృందానికి చెందిన కీలక సభ్యులు సంతోషంగా కనిపిస్తున్నారు. ఆధ్యాత్మికత, సంప్రదాయ భావోద్వేగాలు కలబోసిన ఒక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను రవితేజ అభిమానులకు అందించబోతున్నారని ఈ పోస్ట్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, పాట విడుదల తేదీకి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.