Raviteja Eagle Trailer: 2024 సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాల్లో ఒకటిగా ఉంది మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈగల్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ట్రైలర్ చూస్తే కనుక ‘‘తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా?.. దాన్ని పట్టుకున్న వాడిని తాకినపుడు’’ అంటూ నవదీప్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది.
Karimnagar : కోతి ప్రాణాలను కాపాడబోయి 13 మందిని రిస్క్ లో పెట్టిన డ్రైవర్.. ఇద్దరు మృతి..
రెండు నిమిషాల పదకొండు సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. ఇక ఆ తరువాత విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను, విధ్వంసం నేను, విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను అంటూ రవితేజ చెబుతున్న డైలాగ్ కూడా ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఆ తరువాత కావ్య థాపర్ నాకు గన్ అంటే భయం, బుల్లెట్ అంటే భయం కానీ నువ్ వచ్చాక అంతా మారిపోయింది అనడం, ఇక ఆ తరువాత వాడి ట్రాన్సక్షన్ అనేక దేశాలకు వెళ్తున్నాయి, అంటే వాడు చాలా డేంజరస్ అని అంటుండగా మేమ్ లాస్ట్ టెన్ ఇయర్స్‌లో ఇలాంటి ఫాంటసీ యాక్షన్ స్టోరీస్ ఎప్పుడూ వినలేదని అవసరాల అనడం కూడా ఇంట్రెస్ట్ పెంచేలా ఉంది. ఏమిరా వీడు దేశం మొత్తం ఖయ్యం పెట్టుకున్నాడా? ఏమి? అంటూ అజయ్ ఘోష్ చెప్పడం చూస్తే ఇదేదో ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అనిపిస్తోంది. వీళ్లను కంగారుపెట్టింది, మొత్తం ప్రాంతం కాదు.. ఆ ప్రాంతాన్ని పండించిన వాడు అని అనుపమా చెబుతుండడం కూడా ఆసక్తికరంగా ఉంది.