మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర – మనదే ఇదంతా’ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక రవితేజ తదుపరి సినిమా RT 76 కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రవితేజ – కిషోర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉంది. ‘నన్ను దోచుకుందువటే’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ తరహాలో ఈ సినిమా కూడా ఎమోషన్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ కలిపిన పర్ఫెక్ట్ ప్యాకేజీగా రూపొందుతోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆషికా రంగనాథ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే
తాజాగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం టీమ్ స్పెయిన్‌లో షూటింగ్ చేస్తోందని, అక్కడ ఓ అందమైన మెలోడీ సాంగ్ చిత్రీకరిస్తున్న ట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఆషికా, స్పెయిన్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తీసిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం ఈ సాంగ్ షూటింగ్‌తో స్పెయిన్ షెడ్యూల్ ముగిసిన తరువాత, టీమ్ భారత్‌కు తిరిగి వచ్చి కీలక యాక్షన్ ఎపిసోడ్స్‌ని షూట్ చేయబోతుందని. కాగా ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే కొత్త ఏడాది మొదటి పెద్ద మాస్ ట్రీట్‌గా రవితేజ రానున్నాడు. మొత్తానికి ఆషికా రంగనాథ్ షేర్ చేసిన ఫోటోలు, అప్‌డేట్ వల్ల ఫ్యాన్స్‌లో ఇప్పుడు RT76 పై హైప్ రెట్టింపయింది. రవితేజ మాస్ ఎనర్జీ, కిషోర్ తిరుమల స్టైల్ ఎమోషన్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద పండగే పండగ అని అంటున్నారు అభిమానులు!