Ravi Teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం డిజాస్టర్ల బాటలో ఉన్నాడు. తెలిసి తీసుకుంటున్న నిర్ణయాలతోనే ఇలా డీలా పడిపోతున్నాడు. రవితేజకు మంచి మార్కెట్ ఉంది. ఒక్క హిట్ పడితే వసూళ్లు భారీగానే వస్తాయి. కానీ ఈ నడుమ తీస్తున్న సినిమాలు అన్నీ ప్లాపే. ఎక్కువగా కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోంది. దాంతో పాటు కథల ఎంపికలో రవితేజ రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. రొటీన్ మాస్ కథలను ఎంచుకుంటున్నాడు. కాలం చెల్లిన మాస్ కథలను ప్రేక్షకులు చూడటం ఎప్పుడో మానేశారు. అందుకే స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల దాకా అందరూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు.
Read Also : SSMB 29 : సింహంతో మహేశ్ బాబుకు సీన్స్.. కార్తికేయ పోస్టు వైరల్
విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలు, పురాణాలు, పీరియాడికల్, హిస్టారికల్ లాంటి కథలను ఎంచుకుంటున్నారు. కానీ రవితేజ మాత్రం గత ఐదేళ్ల క్రితం వర్కౌట్ అయిన మాస్ కథలను ఇప్పుడు ఎంచుకుంటే ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. ఈ రోజు మాస్ జాతర ట్రైలర్ చూస్తే అదే రొటీన్ మాస్ డైలాగులు, బిల్డప్ లు కనిపిస్తున్నాయి. అవే ఫైట్లు, అవే హీరోయిజం కనిపిస్తున్నాయి. కథలో స్టఫ్ పెద్దగా కనిపించట్లేదు. ట్విస్టులు లేని కథలను ప్రేక్షకులే పట్టించుకోవట్లేదు. యావరేజ్ హీరోలు కూడా మంచి కథలను ఎంచుకుంటూ వంద కోట్ల క్లబ్ లో చేరిపోతున్నారు.
రవితేజ మాత్రం ఇప్పటి వరకు వంద కోట్ల క్లబ్ లోకే రాలేదు. ఒక్క సినిమా హిట్ అయితే నాలుగు ప్లాపులు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కాబట్టి కొత్త తరహా కథలను ఎంచుకుని నటనకు స్కోప్ ఉండే పాత్రలు చేస్తే బెటర్. అలాగే కొత్త డైరెక్టర్లను కాకుండీ సీనియర్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తే బెటర్. ఎందుకంటే కొత్త డైరెక్టర్లు భారీ బడ్జెట్ సినిమాలను హ్యాండిల్ చేయలేకపోవచ్చు.
Read Also : Sai Durga Tej : నాకు ఆమెనే గుర్తొస్తోంది.. సాయిదుర్గాతేజ్ ఫన్నీ కామెంట్స్
