Ravi Teja : రెండు నెలల్లో రెండు సినిమాలు… జోరు మీదున్న రవితేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja : రెండు నెలల్లో రెండు కొత్త సినిమాలు. ఒకటి స్టార్ నిర్మాతతో, మరొకటి క్రేజీ దర్శకుడితో. వరుస ప్రాజెక్టులతో మళ్లీ ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్లేందుకు మాస్ మహారాజా రవితేజ సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా ఆయన కొత్త సినిమాలపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నా, ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రాజెక్టులు పట్టాలెక్కే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు, అక్టోబర్ నెలల్లో రెండు భారీ చిత్రాల షూటింగ్‌లు ప్రారంభం కానుండటంతో రవితేజ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో రవితేజ చేయనున్న కొత్త సినిమా షూటింగ్ వచ్చే ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కథ, నటీనటుల ఎంపిక, టెక్నికల్ టీమ్ ఖరారు వంటి పనులను పూర్తి చేసే దశలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు, రవితేజ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రంలో రవితేజను మరోసారి అభిమానులు కోరుకునే మాస్ అవతారంలో చూపించే ప్రయత్నం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది.
Also Read
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
ఈ సినిమా ప్రారంభమైన రెండు నెలలకే రవితేజ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా మొదలుపెట్టనున్నట్లు సమాచారం. అక్టోబర్ నుంచి దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్లానింగ్ జరుగుతోంది. వినూత్నమైన శైలితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ, మొదటిసారి రవితేజతో కలిసి పనిచేయబోతుండటం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సినిమాలు కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగా, రవితేజ ఇమేజ్‌కు తగ్గట్టుగా వినోదం, యాక్షన్, ఏమషన్స్ కలసి ఉండేలా కథను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల రవితేజ సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఆయన మార్కెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు. ఇప్పటికీ నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుండటం అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమవుతుండటం, రాబోయే రోజుల్లో రవితేజ కెరీర్‌కు కొత్త ఊపు తీసుకురావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకాలంలో రవితేజ వరుసగా రెండు సినిమాలను ప్రారంభించి మరోసారి టాలీవుడ్లో తన జోరు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’ ఆగస్ట్ 21, 2026న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. అయ్యప్ప స్వామి భక్తి, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంతో సాగే ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఆ రెండు సినిమాలకు మరింత క్రేజ్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.
తాజావార్తలు
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!