Site icon NTV Telugu

Raviteja : ఏంటి.. రవితేజ రెమ్యనరేషన్ తీసుకోకుండా మూవీ చేస్తున్నాడా..?

Raviteja

Raviteja

Raviteja : మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, ఫలితాలు మాత్రం ఆశించినంతగా రావడం లేదు. గత కొన్నేళ్లుగా ఆయన చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్, డైలాగ్స్ చూసి ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రాబోతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర రూమర్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. రవితేజ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటిస్తున్నాడట.

Read Also : Raviteja : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. రవితేజ కొత్త మూవీ గ్లింప్స్ చూశారా..?

సినిమా ఫలితాలు నిర్మాతలపై భారం కాకూడదనే ఉద్దేశంతో రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నాడని పోస్టులు పెడుతున్నారు. సినిమా సక్సెస్ అయితే తరువాత ప్రాఫిట్ షేర్ ఏమైనా తీసుకుంటాడని.. లేదంటే ఏదీ తీసుకోవడని అందులో మీనింగ్. అయితే ఈ విషయంపై రవితేజ లేదా చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కానీ రెమ్యునరేషన్ తీసుకోకుండా రవితేజ ఇప్పటి వరకు సినిమాలు చేసిన దాఖలాలు లేవు. ఈ సినిమాకు ఆల్రెడీ అడ్వాన్స్ రూపంలో కొంత తీసుకున్నట్టు అయితే అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది.

Read Also : OG : ఆ విషయంలో ఓజీ డైరెక్టర్ గ్రేట్.. పరుచూరి కామెంట్

Exit mobile version