Ravi Teja and Sree Vishnu: రవితేజ, శ్రీ విష్ణు మల్టీస్టారర్‌కు ‘వీరాధి వీరులంట’ టైటిల్?.. సంక్రాంతి టార్గెట్‌తో క్రేజీ బజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja and Sree Vishnu: మాస్ మహారాజా రవితేజ, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరి కామెడీ టైమింగ్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఒకే తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు వినోదం డబుల్ అవుతుందనే అభిప్రాయం అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ నిజం కాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడకపోయినా, ఈ మల్టీస్టారర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర వివరాలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుటున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, దర్శకుడు హసిత్ గోలి ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ ఎంటర్టైనర్లో రవితేజ, శ్రీ విష్ణు కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ‘వీరాధి వీరులంట’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇదే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేస్తుందా లేదా అనేది మాత్రం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కుటుంబ కథలు, కమర్షియల్ ఎంటర్టైనర్లు, మల్టీస్టారర్ చిత్రాలతో విజయాలు అందుకున్న ఈ నిర్మాణ సంస్థ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ రానుందనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం కథా చర్చలు, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనే వార్తలు కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు హసిత్ గోలి ఇప్పటికే శ్రీ విష్ణుతో కలిసి ‘రాజా రాజా చోర’, ‘స్వాగ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వినోదాన్ని కొత్త తరహాలో చూపించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు తొలిసారి రవితేజతో కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. రవితేజ ఎనర్జీ, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్‌ను హసిత్ గోలి చూపిస్తారన్న ఆసక్తి సినీ అభిమానుల్లో కనిపిస్తోంది.
Also Read
ప్రస్తుతం ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి సీజన్ ఎప్పటిలాగే భారీ చిత్రాలకు వేదికగా మారుతుండటంతో, ఈ మల్టీస్టారర్ కూడా అదే సమయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే విడుదల తేదీతో పాటు టైటిల్, తారాగణం, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం పూర్తిగా ఇండస్ట్రీ బజ్, సోషల్ మీడియా ప్రచారం ఆధారంగానే ఉన్నాయి. చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తేనే ఈ మల్టీస్టారర్‌పై పూర్తి స్పష్టత రానుంది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం రవితేజ, శ్రీ విష్ణు ఇద్దరి అభిమానులకు ఇది ప్రత్యేకమైన సినిమాగా మారే అవకాశం ఉంది.
- Tags
- cinema
- Ravi Teja
- Sree Vishnu
తాజావార్తలు
-
Lenin : రిజనబుల్ ధరకే ‘లెనిన్’ నైజాం టికెట్ ధరలు
-
R Madhavan: అందమైన హీరోయిన్ల మధ్య ఉన్నా భార్యను ఎందుకు మోసం చేయలేదో చెప్పిన స్టార్ యాక్టర్!
-
Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
-
OG 2 Update : పవర్ స్టార్ ‘OG -2’ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్
-
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!