Ravi Kiran Kola: అందుకే ఆ సినిమాకు షో రన్నర్ గా…..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Kiran Kola:
‘రాజావారు రాణిగారు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రవికిరణ్ కోలా. ప్రస్తుతం రవి కిరణ్ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. జూలై 20 తన పుట్టిన రోజును పురస్కరించుకుని, చిత్రసీమలోకి అడుగుపెట్టిన వైనాన్ని ఆయన మీడియాకు వివరించారు. ”మాది తూర్పు గోదావరి ఏలేశ్వరం మండలంలోని భద్రవరం అనే చిన్న విలేజ్. చిన్నప్పటి నుండి సినిమాపై వున్న ప్యాషన్ తో డైరెక్టర్ అవ్వాలని 2016 లో హైదరాబాద్ వచ్చాను. నేను రాసుకున్న కథను చెప్పడానికి బోలెడంత ప్రయత్నం చేశాను. అయితే నాకు పరిచయం తక్కువ కావడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో స్వచ్ఛ భారత్ పై యాంకర్ రవితో ‘దిల్ సే’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. దీనికి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ నాకు మంచి లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అయ్యింది. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ జై ద్వారా కిరణ్ అబ్బవరం పరిచయమయ్యాడు. మొదట వెబ్ సిరీస్ చేద్దాం అనుకోని తక్కువ బడ్జెట్ లో 15 మంది టీం తో ఈస్ట్ గోదావరి కెళ్ళి షూట్ చేశాం. అయితే కథ బాగుందని, ఫీచర్ ఫిల్మ్ లా ఉందని టీం అంతా ప్రోత్సహించారు. నాకు, కిరణ్ కు అది మొదటి సినిమా అవ్వడంతో ఎంతో కేర్ తీసుకొని తీసిన చేసిందే ‘రాజావారు రాణిగారు’. సురేష్ ప్రొడక్షన్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకోవడమే కాకుండా మంచి విజయం సాధించింది” అని అన్నారు.
Also Read
- Kavya Maran - Anirudh: ఉద్యోగులతో కలిసి కావ్య మారన్, అనిరుధ్ స్పెషల్ లంచ్.. విందులో అదిరిపోయే మెనూ..!
- Vrushakarma Trailer: ‘వృషకర్మ’లో పాటలు, లవ్ స్టోరీ లేవు.. కానీ 2 గంటల 40 నిమిషాలు ఊపిరి బిగపట్టాల్సిందే!
- IFFI 2026: గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మెగాస్టార్ సినిమా సందడి.. దేశవ్యాప్తంగా ఆ 5 చిత్రాల్లో ఒకటిగా రికార్డ్!
- Siddharth Galla Wedding: కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేష్ బాబు మేనల్లుడు! వియత్నాంలో గ్రాండ్ వెడ్డింగ్!

ఇక ఇటీవల విడుదలైన విశ్వక్ సేన్ మూవీ ‘అశోక వనంలో అర్జున్ కళ్యాణం’కు తాను షో రన్నర్ గా ఎందుకు వ్యవహరిచాల్సి వచ్చిందో కూడా రవికిరణ్ కోలా తెలిపాడు. ”ప్రస్తుతం నేను మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ లో ఓ సినిమా చేయబోతున్నాను. అయితే నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. వాటి ద్వారా కొత్త వారికి దర్శకులుగా అవకాశం ఇవ్వాలనుకున్నాను. అయితే ‘అశోక వనంలో అర్జున్ కళ్యాణ్’ చిత్ర బృందం నన్ను షో రన్నర్ గా వ్యవహరించమని కోరింది. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాను. సాధారణంగా నేషనల్, ఇంటర్ నేషనల్ వెబ్ సిరీస్ కు మాత్రమే షో రన్నర్స్ ఉంటారు. షో రన్నర్ అనేది మన సినిమాలకు కొత్త. ఫస్ట్ టైం షో రన్నింగ్ కాన్సెప్ట్ ను యస్.వి.సి.సి. డిజిటల్ వారు తీసుకొద్దాం అనుకొని ‘అశోకవనంలో…’ సినిమాకు షో రన్నర్ గా ఉండమన్నారు. షో రన్నర్ అంటే దర్శకత్వ పర్యవేక్షణ లాంటిది. సినిమాకి సంబంధించిన పూర్తి క్రియేటివిటీ రెస్పాన్స్ బిలిటీ ని తీసుకోవడమే దీని ఉద్దేశం” అని చెప్పారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ లో సినిమా వర్క్ జరుగుతోందని, .దీంతో పాటు ఎస్వీసీసీ బ్యానర్ లో ఇంకో సినిమా చేయబోతున్నానని, అలాగే ఓ అడ్వెంచర్స్ డ్రామా కథ కూడా రెడీగా ఉందని రవికిరణ్ కోలా తెలిపారు.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
Suzuki Ignis EV: Suzuki Ignis EV ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. 26kWh బ్యాటరీ, 90bhp పవర్, పూర్తి వివరాలు ఇవే!
-
Kavya Maran – Anirudh: ఉద్యోగులతో కలిసి కావ్య మారన్, అనిరుధ్ స్పెషల్ లంచ్.. విందులో అదిరిపోయే మెనూ..!
-
Chahal-Dhanashree: బీజేపీలోకి చహల్.. తెలుగు హీరోయిన్గా ధనశ్రీ.. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్!
-
Toyota Innova Hycross Facelift: భారత్‌లో కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్.. ధర, ఫీచర్లు, E85 హైబ్రిడ్ ప్రత్యేకతలు ఇవే!
ట్రెండింగ్
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి