NTV Telugu Site icon

Guntur Kaaram: సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్

Ssmb 28

Ssmb 28

PS Vinod Out from Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క 28 వ చిత్రం, గుంటూరు కారం నిరంతర పుకార్లు, ఊహాగానాలతో ఎప్పటికప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంది. నిజానికి ఈ సినిమా నుంచి ఇప్పటికే పూజా హెగ్డే తప్పుకుంది. ఆ తర్వాత సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు అనేక పుకార్లు వచ్చాయి. ఇప్పుడు గుంటూరు కారం సినిమాటోగ్రాఫర్ పీ ఎస్ వినోద్ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆయనను మధీ తప్పుకోవడంతో తెర మీదకు తీసుకురాగా ఇప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రవి చంద్రన్ ను తెర మీదకు తీసుకురానున్నారు. నిజానికి ఫైట్ మాస్టర్ అన్బరీవ్ 1 వ యాక్షన్ షెడ్యూల్ తర్వాత ప్రాజెక్టు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇక ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమాను క్రూ మార్పులు, షూటింగ్ లేటు కావడం లాంటి సమస్యలు వదిలిపెట్టేలా కనిపించడం లేదని అంటున్నారు.

Sagileti Katha: నవదీప్ సమర్పణలో ‘సగిలేటి కథ’.. ఆరోజే ట్రైలర్ రిలీజ్

ఇక 1వ షెడ్యూల్ తర్వాత, డేట్ సమస్యల కారణంగా సినిమా కథానాయిక పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆ తర్వాత పూజా పాత్ర స్థానంలో శ్రీ లీలను తీసుకొచ్చి ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని తెచ్చారు. అంటే ఇప్పుడు ఆమె శ్రీలీల పాత్రను పోషిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ ఏస్ టెక్నీషియన్ తన రిచ్ విజువల్స్‌తో అరవింద సమృత వీర రాఘవ, అల వైకుంఠపురములో సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రవి చంద్రన్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి మూడు వారాల వెకేషన్ కు వెళ్ళాడు. ఈ రీప్లేస్‌మెంట్స్, షూటింగ్ లో జాప్యం పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అసలు ఏమాత్రం సంతోషంగా లేరు. చాలా కాలంగా, సంగీత దర్శకుడు థమన్ స్థానంలో మరొక సంగీత దర్శకుడిని తీసుకుంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్నా ఆ విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

Show comments