Rathinirvedam Movie to re relase on November 11th: ఈ మధ్య కాలంలో తెలుగు సినీ రీరిలీజ్‌లు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటి వరకు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే మళ్లీ రిలీజ్ చేస్తూ రాగా ఇప్పుడు మాత్రం చిన్న హీరోల సినిమాలు, వివాదాస్పద సినిమాలు అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్న సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా అప్పట్లోనే బోల్డ్ మూవీగా పేరు తెచ్చుకున్న ‘రతి నిర్వేదం’ రీరిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు, అప్పుడు డేట్ రిలీజ్ చేయలేదు కానీ ఇప్పుడు డేట్ కూడా అనౌన్స్ చేశారు. యధార్థ సంఘటనలతో కూడుకున్న పేరొందిన నవల ‘రతినిర్వేదం’ 1978లో సినిమా తెరకెక్కి సూపర్ హిట్ అయింది.
The Great Indian Suicide: ‘పవిత్ర లోకేష్’ను చూస్తే ఇలాంటి లేడీస్ ఉంటారా అనిపిస్తుంది!
అదే టైటిల్‌తో 2011లో ఆ సినిమాను రీమేక్ చేశారు దర్శకుడు టి.కె.రాజీవ్ కుమార్. శ్వేతా మీనన్ కీలక పాత్ర పోషించగా శ్రీజిత్ విజయ్ కీలక పాత్రధారుడుగా నటించారు. అలా మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది, ఈ నెల 11న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్. శ్వేతా మీనన్, శ్రీజిత్ విజయ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రచయిత ఫ పి.పద్మరాజన్, కాగా సంగీతం ఎం.జయచంద్రన్. సూపర్ హిట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు రీరిలీజ్ అవ్వడంలో అర్థం ఉంది కానీ.. శృంగార సన్నివేశాలతో నిండిపోయిన ‘రతి నిర్వేదం’ లాంటి సినిమా కూడా రీరిలీజ్ చేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.