HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ముస్లిం వర్సెస్ హిందు అనే కోణంలో తీశారనే ప్రచారం జరిగితే దాన్ని ఇప్పటికే పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమాను కోవిడ్ కు ముందు ప్రారంభించాం. ఈ మూవీ లైన్ గురించి క్రిష్ నాకు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమాలో మన చరిత్రను చూపించాలని అనుకున్నాం. వీరమల్లు వారసత్వాన్ని ఈ తరానికి చూపించాలని అనుకున్నాం. అంతే తప్ప హిందు వర్సెస్ ముస్లిం అనే కోణంలో తీయలేదు. ఒక నిరంకశుడి క్రూరత్వాన్ని ఈ సమాజానికి వివరించాలనే ప్రయత్నం మాత్రమే చేశాం అంటూ క్లారిటీ ఇచ్చారు పవన్ కల్యాణ్.
Read Also : TG Vishwa Prasad: నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు
ఈ సినిమా గురించి క్రిష్ చెప్పినప్పుడు దీన్ని పీరియాడికల్ జానర్ లో తీద్దామని అనుకున్నాం. ఆ తర్వాత కథలో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ జనరేషన్ కు తగ్గట్టు చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. మూవీ ఆలస్యం అయిన తర్వాత క్రిష్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. అప్పుడు మూవీని రెండు పార్టులుగా చేద్దామని జ్యోతికృష్ణ చెప్పడంతో నేను సరే అన్నాను. మూవీని ఎంటర్ టైన్ మెంట్ కోణంలో తీయడమే మా ఉద్దేశం. ప్రేక్షకులు మెచ్చేలా తీస్తేనే అది బెస్ట్ సినిమా అవుతుంది. వీరమల్లును తీసేటప్పుడు మేం ప్రేక్షకుల ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని చేశాం. అంతే తప్ప కాంట్రవర్సీ కోసం అస్సలు కాదు అంటూ తెలిపారు పవన్ కల్యాణ్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో స్పీడ్ తగ్గినా.. ఏదో ఒక విషయంలో ట్రెండ్ అవుతూనే ఉంది.
Read Also : Ghati-Mirai-The Girlfriend : అనుష్క, తేజసజ్జ మధ్య భీకర పోటీ.. రష్మిక నిలబడుతుందా..?