Site icon NTV Telugu

Rashmika: ఇంతకన్నా బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది..?

Rashmika Mandanna

Rashmika Mandanna

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టింది. నేడు రష్మిక బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించి రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ నిర్మాణంలో ఒక పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ తో ఇప్పటికే దుల్కర్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ .. తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రష్మిక ఒక కాశ్మీర్ ముస్లిమ్ యువతి  అఫ్రీన్  గా కనిపించనుంది.

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల మధ్య తగలబడుతున్న కార్ల దగ్గర భయం లేకుండా నిలబడిన రష్మిక లుక్ ఆకట్టుకొంటుంది. ఇక ఈ సినిమాతో పాటు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో అమ్మడు నటిస్తోంది. ఎప్పటి నుంచో అందరు అనుకున్నట్లే  దళపతి 66 లో అమ్మడు హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. కోలీవుడ్ హీరో విజయ్ సరసన రష్మిక నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపికయ్యింది. త్వరలోనే ఈ సినిమ షూటింగ్ మొదలుకానుంది. ఈ విషయాన్ని రష్మిక తెలుపుతూ” ఇంతకంటే బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాలతో రష్మిక రేంజ్ ఎలా మారుతుందో చూడాలి.

Exit mobile version