Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. ‘మైసా’ నుంచి క్రేజీ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mysa: స్టార్ హీరోయిన్గా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న మరోసారి తన కమిట్మెంట్ను నిరూపిస్తున్నారు. ఒకవైపు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీ షెడ్యూల్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు నటిగా కొత్త ప్రయోగాలకు కూడా వెనుకాడడం లేదు. ఇప్పుడు ఆమె నటిస్తున్న ‘మైసా’ సినిమా కోసం ఓ సాహసమే చేసిందట. రీసెంట్ గా నీటి అడుగున సాగే క్లిష్టమైన సన్నివేశాలను పూర్తి చేసినట్లు చిత్రబృందం కూడా తెలియజేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ‘మైసా’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రష్మిక ఇప్పటివరకు కనిపించని కొత్త తరహా పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. తాజాగా సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన నీటిలోపల సాగే యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సన్నివేశాలను ఆమె విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
చిత్రబృందం తెలిపిన వివరాల ప్రకారం, ఈ అండర్‌వాటర్ ఎపిసోడ్ సినిమా హైలైట్లలో ఒకటిగా నిలవనుంది. ఫుటేజ్ కూడా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులకు థియేటర్లలో ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుందని యూనిట్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సన్నివేశాల కోసం ప్రత్యేక ప్రణాళికతో షూటింగ్ నిర్వహించినట్లు సమాచారం. కేరళ అడవుల్లో అతిరపల్లి జలపాతం వద్ద 80 అడుగుల ఎత్తు నుంచి దూకే క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాల్లో రష్మిక డూప్ లేకుండా నటించి, అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌తో సహా కీలకమైన ఘట్టాలను పూర్తి చేశారు. ప్రస్తుతం ‘మైసా’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మిగిలిన సన్నివేశాలను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజా సమాచారం ప్రకారం టీజర్ జూలై 15న రిలీజ్ చేసి , అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
అన్‌ఫార్ములా ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పలు భాషల్లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హై స్టేక్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ స్వరాలు అందిస్తున్నారు. అలాగే నటుడు తారక్ పొన్నప్ప కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే పలు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న, ‘మైసా’లో పూర్తి భిన్నమైన పాత్రను ఎంచుకోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Tags
- cinema
- Mysa
- Rashmika Mandanna
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?