Site icon NTV Telugu

Rashmika Mandanna: అయ్యో.. మా నేషనల్ క్రష్ కు ఏమైంది.. ఆ పోస్ట్ ఎందుకు పెట్టింది.. ?

Rashmika

Rashmika

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలతో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ రేస్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో తక్కువలో తక్కువ నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో యానిమల్ ఒకటి రిలీజ్ కు సిద్దమవ్వగా.. పుష్ప 2 సెట్స్ మీద ఉంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు.. రష్మిక సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో అభిమానులతో టచ్ లో ఉంటూ ఉంటుంది. ఇక ఈ మధ్యనే రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానిపై రష్మిక స్పందిస్తూ.. తనకు సపోర్ట్ గా నిలిచిన వారందరికీ థాంక్స్ చెప్పింది.

Deepika Padukone: బెడ్ రూమ్ లో అతనితో తెల్లార్లు.. అదే పని

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా రష్మిక పోస్ట్ చేసిన ఒక ఫొటో.. నెట్టింట వైరల్ గా మారింది. ఫోటోలో ఏం లేదు కానీ, అమ్మడు పెట్టిన క్యాప్షన్ మాత్రం ఆమె ఫ్యాన్స్ ను హడలు పుట్టిస్తుంది. అందులో ” రికవరీ కూడా ముఖ్యం” అని రాసుకొచ్చింది. దీంతో అయ్యో.. మా నేషనల్ క్రష్ కు ఏమైంది.. ఆ పోస్ట్ ఎందుకు పెట్టింది.. ?అంటూ అభిమానులు ఒక్కసారిగా కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక వైరల్ ఫీవర్ తో బాధపడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇంట్లో రెస్ట్ తీసుకుంటుందని, ఒకటి రెండు రోజుల్లో రష్మిక కోలుకుంటుందని సమాచారం. దీంతో ఫ్యాన్స్ .. రష్మిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version