Site icon NTV Telugu

NTR30: తారక్ సరసన ఆ కన్నడ బ్యూటీ.. ఆ బాలీవుడ్ భామ కూడా?

Rashmika In Ntr30

Rashmika In Ntr30

Rashmika Mandanna To Play Lead Actress In NTR30: జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలోని NTR30 సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్న విషయంపై ఎలా అయితే క్లారిటీ లేదో, అంతే ఈ చిత్రాన్ని హీరోయిన్ సమస్య పట్టి పీడిస్తోంది. ఎవ్వరూ ఓ పట్టాన ఫైనల్ అవ్వడం లేదు. మొదట్లో ఆలియా భట్‌ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ, సినిమా జాప్యం కావడంతో ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం జాన్వీ కపూర్ పేరు తెరమీదకి వచ్చింది కానీ, ఆ తర్వాత ఆమెని సంప్రదించలేదన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇంకా సమంత, కృతీ శెట్టి సహా మరికొందరు భామల పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే.. అవి రూమర్లుగానే మిగిలిపోయాయి.

ఇప్పుడు లేటెస్ట్‌గా మరో హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆమె మరెవ్వరో కాదు.. రష్మికా మందణ్ణ. ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ వెంటనే పాన్ ఇండియా స్టార్‌గానూ అవతరించడంతో.. భారీ సినిమాల అవకాశాలు వరుసగా వచ్చి పడుతున్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాన కూడా ఈ బ్యూటీ హవానే కొనసాగుతోంది కాబట్టి.. దర్శకనిర్మాతలు ఈమె వెంటే పడుతున్నారు. తాజాగా NTR30 చిత్రబృందం కూడా ఆమెనే తీసుకోవాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఆమెతో చర్చలు జరపడం, రష్మికా గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిపోయాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి అమ్మడు భారీ పారితోషికం కూడా అందుకుంటోందని ఇన్‌సైడ్ న్యూస్! అయితే, దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇదే సమయంలో.. లైగర్‌లో నటించిన అనన్యా పాండేని సైతం సంప్రదించాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా.. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత తారక్, కొరటాల శివ రెండోసారి ఈ NTR30 ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. దీంతో.. ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలే నెలకొన్నాయి. నిజానికి.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లాల్సింది కానీ, ఆర్ఆర్ఆర్ కారణంగా వాయిదా పడింది. ఆ సినిమా పుణ్యమా అని, తారక్‌కి పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో.. పాన్ ఇండియా సినిమాగా మలిచేందుకు మేకర్స్ మళ్లీ కసరత్తులు మొదలుపెట్టారు. స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేశారు. అయితే, ఇప్పుడా పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారని చెప్తున్నారు.

Exit mobile version