తెలుగు ఇండస్ట్రీలో ‘ఛలో’ సినిమాలో అడుగుపెట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన రష్మికా మందన్న, ‘పుష్ప 2’, ‘యానిమిల్’, ‘ఛావా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె వద్ద అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కన్నడలో పుట్టి పెరిగిన రష్మిక ‘కిరిక్ పార్టీ’ తో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు భాషలకు, ప్రాంతాలకు పరిమితి కాకుండా తన నటన ద్వారా అన్ని ఇండస్ట్రీల్లో గుర్తింపు పొందింది.
Also Read : Kajal : కాజల్ కొత్త అవతారం.. రైతుల కోసం పోరాటం!
అయితే ఇటీవల ‘కాంతార చాప్టర్ 1’ సినిమా పాన్ ఇండియా విజయవంతమవుతుండగా, రష్మికా ఒక సోషల్ మీడియా కామెంట్ ద్వారా ట్రోలింగ్‌కు గురైది. కొందరు నెటిజన్లు ఆమెను కన్నడ ఇండస్ట్రీని మర్చిపోయిందని ట్రోల్ చేశారు. అయితే తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. “ఏ సినిమా అయినా రెండు, మూడు రోజుల్లో చూడటం సాధ్యం కాదు. కాంతార కూడా విడుదల అయ్యాక రెండు మూడు రోజులకు చూసాను. చిత్ర బృందాన్ని అభినందించాను. వాళ్లు నాకు ధన్యవాదాలు తెలిపారు. తెర వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత జీవితాన్ని కెమెరా ముందు తీసుకురాలేం. నేను ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకునే వ్యక్తిని కాదు. ప్రజలు నా నటన గురించి ఏమనుకుంటారు, అదే నాకు ముఖ్యం.నా వ్యక్తిగత విషయాలపై అబద్దపు ప్రచారం చేయకండి” అని స్పష్టం చేసింది. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.