నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తన తాజా చిత్రం “పుష్ప: ది రైజ్” విజయంతో ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ చిత్రంపై అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, మహేష్ బాబు, రవీంద్ర జడేజా వంటి ప్రముఖుల నుండి ప్రశంసలు లభించాయి. “పుష్ప : ది రైజ్” మాస్ ఫీస్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ ‘పుష్ప’రాజ్ ఫైర్ తగ్గనేలేదు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ‘పుష్ప-2’పై ఉంది. ఈ నేపథ్యంలో రష్మిక తాజాగా సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘పుష్ప-‘ గురించి కూడా మాటిచ్చేసింది. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్వెల్ మరింత బెటర్ గా, బిగ్గర్ గా ఉంటుందని ప్రామిస్ చేసింది. సినిమా పట్ల అందరూ కురిపించిన ప్రేమ తమను మరింత కష్టపడేలా చేస్తుందని చెప్పుకొచ్చింది.
Read Also : లైవ్ : ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రష్మిక నవ్వుతూ ఉన్న అందమైన ఫోటోను పోస్ట్ చేసింది. “పుష్ప పట్ల మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. ఈ ప్రేమ మమ్మల్ని మరింత కష్టపడి పని చేసేలా చేస్తుంది.. మేము మీకు వాగ్దానం చేస్తున్నాము.. పుష్ప 2 మరింత బిగ్గర్ గా, బెటర్ గా ఉంటుంది!” అంటూ పోస్ట్ చేసింది.
“పుష్ప : ది రైజ్”లో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనంజయ, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. సమంత ‘ఊ అంటావా ఊ ఊ అంటవా’ అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతోంది.