Rashmika Mandanna: రష్మికకు కాంతార కు సంబంధం ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: సోషల్ మీడియా వచ్చాకా ఎవరైనా ఏదైనా మాట్లాడే స్వేఛ్చ వచ్చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలను ట్రోల్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. వారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో ఏ సినిమా తేడా వచ్చినా దాని గురించి సోషల్ మీడియాలో చర్చలు, వారిపై విమర్శలు వచ్చేస్తున్నాయి. ఇక గత కొన్నిరోజుల నుంచి నేషనల్ క్రష్ రష్మికను ట్రోలర్స్ ఆడేసుకుంటున్నారు. అయితే అసలు విషయం ఏంటి అనేది కూడా తెలియకుండా రష్మికను ఎందుకు బ్యాడ్ చేస్తున్నారా..? అని అభిమానులు తలా బద్దలుకొట్టుకుంటున్నారు. అయితే తాజాగా రష్మిక ట్రోల్స్ వెనుక కాంతార సినిమా ఉందని తెలుస్తోంది. రష్మికకు కాంతార కు సంబంధం ఏంటి..? ఆ సినిమా వలన రష్మిక ఎందుకు విమర్శల పాలు అవుతోంది అంటే.. కాంతార కన్నా సినిమా అని అందరికి తెలుసు.
ఇక నేషనల్ క్రష్ కూడా కన్నడ నుంచి వచ్చిందే.. కన్నడ ఇండస్ట్రీ గర్వించదగేలా ఈ సినిమా అన్ని ఇండుస్త్రీలలోనూ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలక్షన్లను కూడా రాబడుతోంది. అలాంటి సినిమాను రష్మిక ఇప్పటివరకు చూడలేదట. ఈ సినిమాను చూసి అన్ని ఇండస్ట్రీలోని స్టార్లు.. వ్వావ్ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తుంటే.. ఒక కన్నడ హీరోయిన్ అయ్యి ఉండి.. మీడియా ముందే కాంతార సినిమా చూడలేదని చెప్పడంతో అమ్మడు ట్రోలర్స్ కు అడ్డంగా బుక్కయ్యింది. ఈ కారణంగానే ట్రోలర్స్ ఆమెపై నెగెటివిటిని స్ప్రెడ్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే మరికొంతమంది మాత్రం ఆమె సినిమా చూడాలి, చూడకపోవాలి అని ట్రోలర్స్ ఎలా డిసైడ్ చేస్తారు.. షూటింగ్స్ తో బిజీగా ఉండి చూడకపోయి ఉండొచ్చు.. ఆమె చూడను అని చెప్పలేదు కదా.. సమయం కుదిరినప్పుడు చూడాలి అనేకదా చెప్పుకొచ్చింది.. దానికి ఇంతలా చేయాలా అంటూ రష్మికకు సపోర్ట్ చేసున్నారు. మరి ఈ ట్రోలింగ్ ను ఆపడానికి నేషనల్ క్రష్.. కాంతార సినిమా చూసి పోస్ట్ పెడుతుందో లేదో చూడాలి.
Also Read
- Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
- Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
- Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
- Shakeela: ఫోన్ అతిగా చూసే రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్నా.. షకీలా షాకింగ్ హెచ్చరిక!
తాజావార్తలు
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
-
Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
-
CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
-
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!