సౌత్ నుంచి బాలీవుడ్ వరకు.. స్టార్ హీరోయిన్ ‘రష్మిక మందన్న’ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్‌కే పరిమితం కాకుండా.. క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రష్మిక ఇటీవల వరుసగా గుర్తుండిపోయే పాత్రలతో మెప్పిస్తున్నారు. శ్రీవల్లి, గీతాంజలి, యేసుబాయి పాత్రలతో ‘ది పెర్ఫార్మర్’గా పేరు సంపాదించారు. వరుసగా గుర్తుండిపోయే పాత్రలు చేస్తున్న రష్మిక.. మరో ఆసక్తికర ప్రాజెక్ట్ చేస్తున్నారు.
పుష్ప 2 చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్న నటన అద్భుతం. భావోద్వేగాలు, సహజమైన హావభావాలతో ఈ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ఆమె ప్రదర్శన సినిమాకు మరో బలంగా మారింది. బాలీవుడ్ సినిమా ‘యానిమల్’లో గీతాంజలి పాత్రలో రష్మిక తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.
మరో బాలీవుడ్ చిత్రం ‘ఛావా’లో మహారాణి యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటన అద్భుతం. చారిత్రక నేపథ్యంతో కూడిన ఆ పాత్రలో రష్మిక గంభీరమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూడు పాత్రలు వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ప్రతి పాత్రకు రష్మిక 100 శాతం న్యాయం చేశారు. ఇప్పుడు రష్మిక మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ‘రణబాలి’లో నటిస్తున్నారు. ఇందులో జయమ్మ అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఈ పాత్ర కూడా రష్మిక కెరీర్‌లో మరో ఐకానిక్ రోల్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వరుస విజయాలతో, విభిన్న పాత్రల ఎంపికతో రష్మిక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ‘పెర్ఫార్మర్’గా తన స్థానం మరింత బలపర్చుకుంటున్నారు.
