సౌత్ నుంచి బాలీవుడ్ వరకు.. స్టార్ హీరోయిన్ ‘రష్మిక మందన్న’ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్‌కే పరిమితం కాకుండా.. క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రష్మిక ఇటీవల వరుసగా గుర్తుండిపోయే పాత్రలతో మెప్పిస్తున్నారు. శ్రీవల్లి, గీతాంజలి, యేసుబాయి పాత్రలతో ‘ది పెర్ఫార్మర్’గా పేరు సంపాదించారు. వరుసగా గుర్తుండిపోయే పాత్రలు చేస్తున్న రష్మిక.. మరో ఆసక్తికర ప్రాజెక్ట్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్న నటన అద్భుతం. భావోద్వేగాలు,…