Rashmika : నేషనల్ క్రష్ రష్మిక తనపై కుట్ర జరుగుతోందని చెప్పి సంచలనం రేపింది ఈ బ్యూటీ. రష్మిక ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతోంది. ఏం మాట్లాడినా అది ఇట్టే వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయట పెట్టింది. నేను సోషల్ మీడియాలో ఉన్నట్టు ఇంట్లో అస్సలు ఉండను. ఇంట్లో చాలా ఎమోషనల్ గా ఉంటాను. వాటన్నింటినీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తే కావాలనే కెమెరా ముందు యాక్ట్ చేస్తుందని అనుకుంటారు.
Read Also : Dhanush-Mrunal Thakur :ధనుష్ తో డేటింగ్.. ఎట్టకేలకు స్పందించిన మృణాల్..
అందుకే నేను అలా చేయను. నా చుట్టూ ఎంతో నెగెటివిటీ స్ప్రెడ్ అవుతోంది. దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. నన్ను కావాలనే కొందరు డబ్బులిచ్చి ట్రోల్ చేయిస్తున్నాను. నన్ను ఎదగనీయకుండా అడ్డుకునేందుకు ట్రై చేస్తున్నారు. వాళ్లు ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి వాటికి నేను లొంగిపోను. నన్ను నేను ఎప్పుడూ నమ్ముకుని ముందుకు వెళ్తుంటాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రష్మిక. కానీ తనపై ట్రోల్స్ చేయిస్తోంది ఎవరనేది మాత్రం బయట పెట్టలేదు. ఇంతకీ ఆమెపై ట్రోల్స్ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటూ ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్.
Read Also : Prabhas : గుడ్ న్యూస్.. ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి ప్రకటన
