Rashmika: స్టేజ్ పైనే రష్మికను అవమానించిన సుకుమార్.. మరి అంత దారుణంగానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గీతాగోవిందం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ సినిమా తరువాత వెనక్కి చూసుకోకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పాన్ ఇండియా మూవీలో నటించే వరకు వచ్చింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 4 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సుకుమార్..రష్మికను స్టేజ్ పైనే అవమానించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఈ వేదికపై సుకుమార్ మాట్లాడుతూ “ఈ వేడుకకు అతిధులుగా వచ్చిన యంగ్ హీరోయిన్స్ సాయి పల్లవి, కీర్తి సురేష్ లను ప్రసంశలతో ముంచెత్తాడు. అంతేకాకుండా అస్సలు వేడుకకే రాని సమంతను సైతం పొగిడి ఆకాశానికి ఎత్తేశాడు. కానీ, పక్కనే ఉన్నరష్మికను మర్చిపోయాడు. మర్చిపోవడమే కాదు.. అక్కడే ఉన్న రష్మికని నీ పేరేంటి? అని అడిగి అవమానించాడు.. మళ్లీ వెంటనే రష్మిక మందన్నా అంటూ ఆయనే చెప్పి.. ఆమె గొప్ప నటి” అంటూ పొగిడేశారు. అయితే ఇదంతా అక్కడ జోక్ గా జరిగినా ఈ సంభాషణను నేషనల్ క్రష్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక పుష్ప సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇంకా పుష్ప 2 కూడా సెట్స్ మీద ఉంది. అలా తనతో వర్క్ చేసే హీరోయిన్ పేరును సుక్కు ఎలా మర్చిపోతాడు.. అక్కడ ఆమెను అంతగా ఆట పట్టించడానికి కూడా లేదు.. వేరే హీరోయిన్ల ముందు ఆమెను తక్కువ చేసి మాట్లాడడం కాకపోతే ఏంటి అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పద్దతి కాదు సుక్కు అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.
Also Read
- Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
- Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
- Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
- Chiranjeevi - Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు - ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
తాజావార్తలు
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
-
Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!