Site icon NTV Telugu

Rashmika : రష్మిక దేవరకొండ అంటూ అరిచిన ఫ్యాన్స్.. ఆమె రెస్పాన్స్ ఏంటంటే..?

Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎక్కడికెళ్లినా ఆమె చుట్టూ అభిమానుల గుంపే ఉంటుంది. ముఖ్యంగా ఆమె సినిమాల ప్రమోషన్స్, ఈవెంట్స్‌లో అభిమానులు హడావుడి చేయడం సహజమే. ఇక రీసెంట్ గానే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ మూవీ కలెక్షన్ల పరంగా బాగానే దూసుకుపోతోంది. అయితే చాలా గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ ప్రమోషన్లలో భాగంగా రష్మిక ఓ ఈవెంట్ కు వెళ్తే అక్కడ ఫ్యాన్స్ అందరూ రష్మిక దేవరకొండ అంటూ అరిచేశారు. మనకు తెలిసిందే కదా.. రష్మిక, విజయ్ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారని. కాకపోతే వీరిద్దరూ తమ ప్రేమను బయట పెట్టట్లేదు.

Read Also : Tamannah : అలాంటి ఇంజెక్షన్లు వాడుతున్న తమన్నా..? అసలు నిజం ఇదే..!

రీసెంట్ గానే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అప్పటి నుంచి రష్మిక ఎక్కడకు వెళ్లినా సరే విజయ్ పేరు వినిపిస్తోంది. ఇక తాజాగా రష్మిక దేవరకొండ అంటూ అరవడంతో ఆమె చూసీ చూడనట్టు స్మైల్ ఇచ్చింది. కానీ ఏం రియాక్ట్ కాలేదు. దీంతో ఆమె నిజంగానే విజయ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఎప్పుడూ సినిమా షూటింగులతోనే ఉంటున్నా.. అప్పుడప్పుడు విజయ్ తో కలిసి బయట తిరుగుతూనే ఉంటుంది.

Read Also : Chiranjeevi : చిరంజీవి కోసం చరణ్‌ కీలక నిర్ణయం..

Exit mobile version